Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోదాలో ఏముంది బొంద. అన్నీ ప్యాకేజీలో ఉంటే.. అంటున్న వెంకయ్య

ప్రత్యేక హోదా అంటూ పాత చింతకాయపచ్చడిని పట్టుకు వేళ్లాడుతున్నఏపీ ప్రతిపక్షాలకు కేంద్రం అందిస్తున్న సహాయం కనిపించడం లేదా అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో ఒక అ

హోదాలో ఏముంది బొంద. అన్నీ ప్యాకేజీలో ఉంటే.. అంటున్న వెంకయ్య
హైదరాబాద్ , మంగళవారం, 31 జనవరి 2017 (03:36 IST)
ప్రత్యేక హోదా అంటూ పాత చింతకాయపచ్చడిని పట్టుకు వేళ్లాడుతున్నఏపీ ప్రతిపక్షాలకు కేంద్రం అందిస్తున్న సహాయం కనిపించడం లేదా అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో ఒక అవగాహనతో ముందుకెళుతున్న బీజేపీ, టీడీపీ మధ్య తెగతెంపులే జరిగితే ఏపీకి జరిగే నష్టం మామూలుగా ఉండదని హెచ్చరించారు.
 
ఏపీకి ప్రత్యేకహోదాపై జనసేన అధినేత పవన్‌‌కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ ఉద్యమం ఉదృతం చేస్తున్న తరుణంలో ఏపీకి కేంద్రం తరపున లభించిన ప్రయోజనాల్ని వెంకయ్య నాయుడు వరుసగా ఏకరువు పెట్టారు. 
 
ప్రత్యేక హోదా ద్వారా ఏడాదికి రూ.3500 కోట్లు మాత్రమే వస్తాయి. విభజన చట్టంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక హోదా చేర్చితే సమస్య ఉండేది కాదు. హోదాతో పనిలేకుండా ఉదయ్ పథకం కింద ఏపీకి చాలా లబ్ధి చేకూర్చాం. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవాలని వైసీపీ అంటోంది. బీజేపీ, టీడీపీ విడిపోతే ఏపీ అభివృద్ధి ఆగిపోతుంది అంటూ వెంకయ్య హెచ్చరించారు.  ఏపీకి ప్రత్యేక హోదాకు మించిన ప్రయోజనాలను తాము కల్పించామన్నారు.
 
విశాఖ రైల్వేజోన్ పెండింగ్‌లో ఉంది. రైల్వేజోన్ రెండు రాష్ట్రాలతో ముడిపడి ఉంది. ఏపీలో ఎయిర్‌పోర్టులు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. సీఎం ముందు చూపుతో వేల ఎకరాలు సేకరించారు. ఏపీకి ప్రధాని అండ ఉంది. 2019 వరకు ఓపిక పట్టండి అంటూ వెంకయ్య ఊరించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేసిన తప్పులకు మన్నించండి ఓటరు దేవుళ్లారా.. తన చెప్పుతో తానే దండించుకున్న మాజీ ఎమ్మెల్యే