Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక మోదీకి- బాబుకి స్నేహ 'వారధి' లేనట్లేనా? ఏపీ సీఎంకు కష్టాలేనా?

2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ-బాబు హిట్ పెయిర్ అని ప్రచారం చేసారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన రాబడి వాటాలు, నీటి పంపకాలు, పోలవరానికి గ్రాంటు, కేంద్ర విద్యా సంస్థలు ఇలా పలు అంశాల్లో బాబు ప్రభుత్వానికి వె

Advertiesment
ఇక మోదీకి- బాబుకి స్నేహ 'వారధి' లేనట్లేనా? ఏపీ సీఎంకు కష్టాలేనా?
, మంగళవారం, 18 జులై 2017 (13:19 IST)
2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ-బాబు హిట్ పెయిర్ అని ప్రచారం చేసారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన రాబడి వాటాలు, నీటి పంపకాలు, పోలవరానికి గ్రాంటు, కేంద్ర విద్యా సంస్థలు ఇలా పలు అంశాల్లో బాబు ప్రభుత్వానికి  వెన్నుదన్నుగా నిలిచిన మాజీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఇప్పుడు "ఉప రాష్ట్రపతి" ఎన్నికల్లో నిలవడానికి తన పదవికి రాజీనామా చేసారు. ఇంతటితో తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నారు. 
 
2015 సంవత్సరంలో ఇరు రాష్ట్రాల మధ్య రేగిన ఆడియో టేపుల వ్యవహారాన్ని, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిన వ్యవహారాన్ని పెద్దది కాకుండా తన చాకచక్యంతో అణచడంలో "పెద్దన్న" పాత్ర పోషించాడు. ఇకపోతే ఏపీ నుండి కేంద్రం నివేదికలు తెప్పించుకొని, కొన్ని విషయాలపై లోతుగా పరిశీలించి, ఏపీ పట్ల కఠినంగా వుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో బాబుగు వెన్నుదన్నుగా వుండే వెంకయ్య నాయుడుకి ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టడంతో ద్వారా ఏపీ సీఎంకె చెక్ పెట్టేసినట్లేననే కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 
మొత్తమ్మీద ఏపీలో భాజపాను బలోపేతం చేసేందుకు భాజపా వేసిన అడుగుగా చెప్పుకుంటున్నారు. వెంకయ్య నాయుడు కాస్తా ఉపరాష్ట్రపతి రేసులో ఉండటంతో కేంద్రం-ఏపీ మధ్య సంబంధాలు మరింత దూరమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇకపై వారిని కలిపి ఉంచే ప్రయత్నం చేసేవారు మరియు వారి నడుమన "వారధి"గా నిలిచేవారు ఎవరన్నది కాలమే నిర్ణయించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్ చోరీలకు ఆధార్ ఆధారమవుతుందా?