మోదీజీ ఆ పదవి నాకొద్దు... వెంకయ్య నాయుడు?
ఉపరాష్ట్రపతి. దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి. భారతీయ జనతాపార్టీలో ఉపరాష్ట్రపతి పదవికి పెద్దగా అర్హులు లేరని విమర్శ వుంది. అందుకే ప్రధానమంత్రి, పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్న తరువాత వెంకయ్య నాయుడుకు ఆ పదవి అప్పజెప్పేందుకు స
ఉపరాష్ట్రపతి. దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి. భారతీయ జనతాపార్టీలో ఉపరాష్ట్రపతి పదవికి పెద్దగా అర్హులు లేరని విమర్శ వుంది. అందుకే ప్రధానమంత్రి, పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్న తరువాత వెంకయ్య నాయుడుకు ఆ పదవి అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పేరును దాదాపు ఖరారు కూడా చేసేశారని తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రమే వెంకయ్య నామినేషన్ కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే వెంకయ్య మాత్రం అందుకు సుముఖంగా లేరట.
ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే ఒక్కచోటే కూర్చుని ఉండిపోవాలని, కేంద్రమంత్రిగానే ఉండటం తనకు ఇష్టమన్న ఆలోచనలో ఉన్నారట. ఇదే విషయాన్ని ప్రధానికి చెప్పేందుకు వెంకయ్య సిద్థంగా ఉన్నారట. ప్రధాని, వెంకయ్యకు మధ్య మంచి సన్నిహిత సంబంధమే ఉంది. ఒకరిమాట ఒకరు ఖచ్చితంగా వింటారు. ఆ నమ్మకంతోనే వెంకయ్యను అడగకుండానే ఏకంగా ప్రధానే నిర్ణయం తీసేసుకున్నారు.
అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయడం వెంకయ్యకు ఏ మాత్రం ఇష్టం లేదట. నిన్న సాయంత్రం బిజెపి నేతలందరూ కలిసికట్టుగా శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం చేస్తే వెంకయ్య సున్నితంగా తిరస్కరించారట. తనకు ఏ మాత్రం ఉపరాష్ట్రపతి ఇష్టం లేదని, ఒకవేళ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడి గెలిస్తే ఖచ్చితంగా వెంకయ్య అందరికీ దూరమవ్వక తప్పదు. ఢిల్లీకే పరిమితమవ్వాల్సి ఉంటుంది. అది వెంకయ్యకు ఏ మాత్రం ఇష్టం లేదట.