ఆంధ్రా ప్రజలు చీ కొడుతున్నారు.. మిత్రుల మధ్య అంతరం పెరుగుతోంది.. ప్రధాని మోడీతో వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేటాయించే అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సీమాంధ్ర ప్రజలకు ఏమాత్రం రుచించడం లేదు. దీంతో ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారును తూర్పారబడుతున్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేటాయించే అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సీమాంధ్ర ప్రజలకు ఏమాత్రం రుచించడం లేదు. దీంతో ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారును తూర్పారబడుతున్నారు. అదేసమయంలో సోమవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. సమస్య తీవ్రతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా రేపుతున్న మంటలపై ప్రధానికి స్వయంగా వెంకయ్య ఫోన్ చేశారు. రాజ్యసభలో చర్చ జరిగిన తర్వాత జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్టు ప్రధానికి వివరించారు. అదేసయంలో మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య అంతరం పెరుగుతోందని, ఇది ఏమాత్రం మంచిది కాదని వెంకయ్య తెలిపినట్టు సమాచారం.
ఎన్నికలకు ముందు బీజేపీ స్వయంగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన, అవకాశం ఉన్నంత మేరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని వెంకయ్య సూచించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబుతో జరిగిన సమావేశ వివరాలను మోడీ ఆరా తీసినట్టు సమాచారం.