ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఏమిటో ప్రజలకిప్పుడు బాగా అర్థమైంది... వెంకయ్య వ్యాఖ్య
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని, నవజ్యోత్ సింగ్ పెట్టే పార్టీ వల్ల బిజెపికి ఎలాంటి నష్టం లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎవరెన్ని పార్టీలు పెట్టినా పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో బిజెపినే గెలుస్తుందన్నారాయన. తిరుపతి విమానాశ్రయంలో మీడ
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని, నవజ్యోత్ సింగ్ పెట్టే పార్టీ వల్ల బిజెపికి ఎలాంటి నష్టం లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎవరెన్ని పార్టీలు పెట్టినా పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో బిజెపినే గెలుస్తుందన్నారాయన. తిరుపతి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన వెంకయ్య ఆమ్‌ఆద్మీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఆమ్ ఆద్మీ అంటే ఏమిటో ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమైందన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక నరేంద్రమోడీపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో పట్టణాలను అభివృద్థి చేసే ప్రణాళికలు సిద్థమవుతోందని, కొత్తగా నిధులను ఏమి పట్టణాల కోసం వెచ్చించడం లేదన్నారు వెంకయ్యనాయుడు.