సాధారణంగా మహిళలకు గర్భసంచి ఉంటుంది. అయితే ఒక పురుషుడికి గర్భసంచి రావడం ఎక్కడైనా చూశామా.. ఇదే వింత చిత్తూరు జిల్లాలో జరిగింది. తమిళనాడు రాష్ట్రం హోసూరు పట్టణానికి చెందిన అమరీష్ కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు రెండురోజుల క్రితం చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రియా నర్సింగ్ హోంలో చేర్పించారు.
అమరీష్‌కు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. దీంతో గురువారం మధ్యాహ్నం వైద్యులు ఆపరేషన్‌ను ప్రారంభించారు. వైద్యులు ఆపరేషన్ చేస్తుండగా గర్భసంచి కనిపించింది. వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అమరీష్ తల్లిదండ్రుల అనుమతితో గర్భసంచిని తొలగించారు వైద్యులు. ప్రస్తుతం అమరీష్ ఆరోగ్యం బాగానే ఉందని ఆపరేషన్ చేసిన డాక్టర్ సుధీర్ మీడియాకు తెలిపారు.