Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్తూరు జిల్లా టీడీపీలో అసంతృప్తి సెగ.. బొజ్జలకు బాబు ఫోన్.. నో రెస్పాన్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చిత్తూరు జిల్లా టీడీపీలో చిచ్చు రేపింది. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత బొజ్జల రామకృష్ణారెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించారు. అనారోగ్యం

Advertiesment
చిత్తూరు జిల్లా టీడీపీలో అసంతృప్తి సెగ.. బొజ్జలకు బాబు ఫోన్.. నో రెస్పాన్స్
, ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (11:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చిత్తూరు జిల్లా టీడీపీలో చిచ్చు రేపింది. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత బొజ్జల రామకృష్ణారెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించారు. అనారోగ్యం కారణంగా బాధపడుతున్నందుకే ఆయనను పదవి నుంచి తప్పించినట్లు టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 
 
అయితే ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బొజ్జల మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. ఆయనను బుజ్జగించేందుకు స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. అయితే చంద్రబాబు బొజ్జలకు ఫోన్ చేసినట్లు తెలిసింది. ఫోన్‌కు కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అందుబాటులోకి రాలేదు. దీంతో హైదరాబాద్‌ వెళ్లాలని గంటా, సీఎం రమేష్‌కు చంద్రబాబు ఆదేశించారు. వెళ్లి వెంటనే బొజ్జలను విజయవాడకు తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. 
 
మరోవైపు... తనను మంత్రి పదవి నుంచి తప్పించడంపై బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు, సీఎంకు ఆయన పంపించారు. పార్టీలో సీనియర్‌గా ఉన్న తనను తప్పించడమేంటని సన్నిహితుల వద్ద ఆయన వాపోయినట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసత్య ప్రచారం చేసి తప్పించారు.. చంద్రబాబుకు షాకిచ్చారు.. ఎమ్మెల్యే పదవికి బొజ్జల రిజైన్!