Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11 యేళ్ళ బాలుడిపై 17 యేళ్ల యువకుడి అసహజ లైంగిక దాడి

హైదరాబాద్ నగరం పాతబస్తీలో ఓ దారుణం జరిగింది. 11 సంవత్సరాల బాలుడిపై 17 యేళ్ళ యువకుడు లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేశాడు. ఈ దారుణం చాంద్రాయణగుట్ట బార్కాస్‌లో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Advertiesment
Hyderabad
, గురువారం, 6 జులై 2017 (16:45 IST)
హైదరాబాద్ నగరం పాతబస్తీలో ఓ దారుణం జరిగింది. 11 సంవత్సరాల బాలుడిపై 17 యేళ్ళ యువకుడు లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేశాడు. ఈ దారుణం చాంద్రాయణగుట్ట బార్కాస్‌లో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బార్కాస్‌ ఏరియాకు చెందిన 11 యేళ్ల బాలుడు గత నెల 28వ తేదీన అదృశ్యమయ్యాడు. దీనిపై ఆ బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
స్థానికంగా అమర్చిన సీసీ కెమెరాలు పరిశీలించగా అనుమానితంగా కనిపించిన 17 సంవత్సరాల బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో 11 యేళ్ళ బాలుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు. 
 
బాలుడిని నిందితుడు ప్రభుత్వ పాఠశాల భవనంపైన ఏర్పాటు చేసిన నీళ్లట్యాంక్‌ వెనుకకు తీసుకుపోయి అసహజ లైంగిక దాడి చేశాడ‌ని.. విష‌యం ఎవరికైనా చెబుతాడనే ఉద్దేశ్యంతో ఇనుపరాడ్‌తో తలపై కొట్టి చంపేశాడని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ భామలు ప్రయాణించే బస్సును నడిపే డ్రైవర్ ఉద్యోగం ఇస్తే...(వీడియో)