Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు: కాకినాడలో ఉన్నతి ఫౌండేషన్ కొత్త వృత్తి శిక్షణా కేంద్రం ప్రారంభం

Advertiesment
image

ఐవీఆర్

, మంగళవారం, 7 అక్టోబరు 2025 (17:09 IST)
కాకినాడ: నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులకు వృత్తి శిక్షణను అందించే లాభాపేక్షలేని సంస్థ అయిన ఉన్నతి ఫౌండేషన్ కాకినాడలో కొత్త శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. కెప్టెన్ సుబ్బారావు ప్రభల ఉదార మద్దతుతో ప్రారంభించబడిన ఈ కేంద్రం, కీలకమైన ఉపాధి నైపుణ్యాలను, ఉద్యోగ అవకాశాలను పొందేందుకు యువతకు వీలు కల్పిస్తుంది. 2024లో కాకినాడలో తన శిక్షణా కార్యక్రమాలను ఉన్నతి ప్రారంభించింది, దాదాపు 70 మందికి పైగా యువతకు విజయవంతంగా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధిని కల్పించడంలో సహాయపడింది. అంతేకాకుండా, ఈ సంస్థ కళాశాలల్లో UNXT శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది, కాకినాడలో దాదాపు 1,700 మంది విద్యార్థులకు చేరువవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయబడిన వృత్తి శిక్షణా కేంద్రం, UNXT మోడల్‌తో కలిపి, ప్రతి సంవత్సరం కాకినాడలో 2,000 మందికి పైగా యువతకు నైపుణ్యం, వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలను ఉన్నతి అందించనుంది. వృత్తి శిక్షణ కేంద్రంలో, శిక్షణ పొందిన ప్రతి వ్యక్తికి 35వ రోజు శిక్షణ నాటికి ఉద్యోగం లభిస్తుందనే భరోసా అందించబడుతుంది, ఇది దీర్ఘకాలిక, స్థిరమైన కెరీర్‌లకు పునాది వేస్తుంది.
 
ఈ కేంద్రం ప్రారంభించడం ద్వారా, కాకినాడలో వీలైనంత ఎక్కువ మంది యువతను నేటి ఉద్యోగ రంగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేయడమే మా లక్ష్యం. ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంలో ఉదార మద్దతు ఇచ్చినందుకు కెప్టెన్ సుబ్బారావు ప్రభలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆయన నమ్మకం నిజంగా ప్రశంసనీయం, ఆయనతో భాగస్వామ్యం చేసుకోవడాన్ని  గౌరవంగా ఉన్నతి భావిస్తోంది అని ఉన్నతి ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ స్వామి అన్నారు.
 
ఈ కార్యక్రమంపై తన ఆలోచనలను కెప్టెన్ ప్రభల వెల్లడిస్తూ, ఆంధ్రప్రదేశ్‌కు అపారమైన సామర్థ్యం ఉంది, కానీ అర్థవంతమైన ఉపాధిని పొందడానికి విద్య ఒక్కటి మాత్రమే ఎల్లప్పుడూ సరిపోదు. ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంలో ఉన్నతికి మద్దతు ఇవ్వడం ద్వారా కాకినాడ యువతకు వారి స్వంత కాళ్ళపై వారు నిలబడటానికి, సమాజానికి గౌరవంగా సేవ చేయడానికి సహాయపడేలా అవకాశాలను పొందేలా చేయటానికి ఇది మా వినయపూర్వక సహకారం అని అన్నారు. 
 
ఉన్నతి శిక్షణా కేంద్రాలు మరియు కాకినాడలోని UNXT యువతకు వివిధ రంగాలలో ప్రవేశ దశ ప్రొఫెషనల్ ఉద్యోగాలను పొందేందుకు వీలు కల్పించాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, భీమా (BFSI)లో బిజినెస్ అసోసియేట్‌లుగా చాలామంది నియమించబడ్డారు. మరికొందరు బీపీఓ మరియు టెలికాలింగ్ కార్యకలాపాలలో చేరారు. చిన్న పట్టణాల్లో, మంచి జీతం ఉన్న ఉద్యోగ అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి. కొన్ని కంపెనీలలో ఒకే తరహా ఉద్యోగాలు ఉండటంతో పాటుగా తాజా గ్రాడ్యుయేట్ల కంటే అనుభవజ్ఞులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. పట్టణ, మెట్రోపాలిటన్ నగరాల్లోని నియామకాలకు యువతను అనుసంధానించడం ద్వారా, విస్తృత శ్రేణి ఉద్యోగాలకు, మెరుగైన జీతం, ప్రయోజనాలకు, కెరీర్ వృద్ధికి, అధునాతన సాంకేతికతలకు చేరువ అయ్యే అవకాశంను ఉన్నతి కల్పిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెల్లిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడనీ యువకుడిని హత్య చేసిన అన్న