Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ సాధన ఎంపీల వల్లే సాధ్యమైంది.. కేసీఆర్ చేసిందేమీ లేదు: ఉండవల్లి

తెలంగాణ సాధన కోసం చేసిందంతా తెలంగాణ ఎంపీలేనని.. 2009కి తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ చేసిందేమీ లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ అనే ఒక బొమ్మను ఊరేగిస్తూ తిరిగి, ఆయన్ని హైలైట్ చేశారన

Advertiesment
Undavalli Arun Kumar writes a Book on AP Bifurcation
, సోమవారం, 19 సెప్టెంబరు 2016 (10:29 IST)
తెలంగాణ సాధన కోసం చేసిందంతా తెలంగాణ ఎంపీలేనని.. 2009కి తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ చేసిందేమీ లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ అనే ఒక బొమ్మను ఊరేగిస్తూ తిరిగి, ఆయన్ని హైలైట్ చేశారని జైపాల్ రెడ్డి కూడా చెప్పారు. కేసీఆర్ చేసిన నిరాహారదీక్ష ఏమిటో తమకు తెలుసని, ఎందుకు బయటపెట్టలేదంటే తెలంగాణ ఉద్యమానికి దెబ్బ తగులుతుందని జైపాల్ రెడ్డి స్పష్టంగా చెప్పారని ఉండవల్లి వెల్లడించారు.
 
ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో విభజనకు ముందు జరిగిన విషయాలను ఉండవల్లి ప్రస్తావిస్తూ.. రాష్ట్ర విభజన వల్ల ఏపీకే లాభమని కేసీఆర్ నాడు చెప్పారని ఉండవల్లి తెలిపారు. ఇంకా విడిపోయేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర విభజన ఒక్కటే తన ఆశ అని అప్పుడు కేసీఆర్ చెప్పారు. అతను బాగా మాట్లాడతాడు, బాగా చెప్పుకొచ్చాడు. తాను కేసీఆర్‌తో ఏకీభవించి, వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డిగారికి చెప్పాను. కేసీఆర్, రాజశేఖరెడ్డిగారు ఏమి మాట్లాడుకున్నారో తనకు తెలియదని అరుణ్ కుమార్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లేటు బిర్యానీ కోసం 42 బస్సులు తగులబెట్టిన యువతి.. ఎక్కడ?