Publish Date: Tue, 31 Mar 2026 (19:36 IST)
Updated Date: Tue, 31 Mar 2026 (19:41 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సాంకేతిక విప్లవానికి కీలక అడుగు పడింది. దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ ఏప్రిల్ 14వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. విద్యారథులు, పరిశోధకులు ఈ అత్యాధునిక సాంకేతికతను టెస్టింగ్ కోసం వినియోగించుకోవచ్చని క్యూబిక్ ఫోర్స్ సంస్థ డైరెక్టర్ వెంకట్ సుబ్రమణ్యన్, ఎస్ఆర్ఎం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సతీష్ కుమార్ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం హార్డ్ వేర్ తయారీ ఎకో సిస్టమ్ ఏర్పాటుపై ఈ భేటీ జరిగింది.
కాగా, ఈ సమావేశానికి మొత్తంగా 30కి పైగా క్వాంటం కంప్యూటింగ్, క్రయోజనిక్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులు హాజరుకావడం విశేషం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 15 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటిలో 7 సంస్థలు విజయవాడలోని మేధా టవర్స్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ పరిణామాలతో అమరావతి దేశ క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
అదరగొట్టిన పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ - అట్టడుగు స్థానం నుంచి అగ్రస్థానానికి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాక జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధీనంలో ఉన్న ఈ శాఖ గత వైకాపా ప్రభుత్వ హయాంలో జాతీయ స్థాయిలో అట్టడు స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అధికార మార్పిడి చోటుచేసుకున్న తర్వాత ఆ శాఖను పవన్ కళ్యాణ్ ఏరికోరి తీసుకున్నారు. కనీసం రెండేళ్లు పూర్తికాకముందే ఆ శాఖ జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. ఫలితంగా అట్టడుగు స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకుంది. పైగా, ఆ శాఖకు ఏకంగా ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో కనబరిచిన అత్యుత్తమ పనితీరుకుగానూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్, జల్ సంచయ్-జన్ భాగీదారి అనే రెండు కీలక విభాగాల్లో ఏపీ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. మరో విభాగంలో ద్వితీయ స్థానం, ఇంకో రెండు విభాగాల్లో తృతీయ స్థానం దక్కించుకుని మొత్తం ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని ప్రోత్సహించే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్‌లో ఏపీ పనితీరు విశేషంగా మెరుగుపడింది.
గత ప్రభుత్వ హయాంలో ఇదే విభాగంలో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. అలాగే, తక్కువ ఖర్చుతో వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతులను ప్రోత్సహించే 'జల్ సంచయ్ - జన్ భాగీదారీ' కార్యక్రమంలోనూ ఏపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సౌకర్యాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులోభాగంగానే 'పల్లెపండుగ 1.0', 'పల్లెపండుగ 2.0' వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించి, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. గ్రామసభలలో వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా 'పల్లెవెలుగు' కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శాఖ పనితీరు గణనీయంగా మెరుగుపడి, జాతీయ స్థాయిలో ఈ పురస్కారాలు దక్కడం విశేషం.