Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు.. కొట్టడంతో గర్భస్రావం

Advertiesment
లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు.. కొట్టడంతో గర్భస్రావం
, సోమవారం, 29 జూన్ 2020 (10:59 IST)
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. భర్త వెంకటేశ్వరరావు వేధింపులతో పాటు మరో మహిళతో తన భర్తకి వివాహేతర సంబంధం ఉండటాన్ని భరించలేకపోయిన లావణ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు లావణ్య తీసుకున్న సెల్ఫీ వీడియోలో సైతం పలు విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో అసలు ఆ మహిళ ఎవరు అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. అయితే తన కుమార్తెను వెంకటేశ్వర్‌ రావు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపిస్తున్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచే వెంకటేశ్వర్ రావు తన కుమార్తెను చాలా విధాలుగా వేధించాడని, తమ నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడని ఆయన మండిపడుతున్నారు.
 
ఈ కేసులో ఇప్పటికే వెంకటేశ్వర్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు.. లావణ్య అత్తామామలను పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త  ఓ ఎయిర్‌లైన్స్ మహిళా ఉద్యోగినితో వివాహేతర సంబంధం నెరుతూ.. లావణ్యకు దొరికిపోయాడని తెలిసింది. ఆ తర్వాత అతడి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి.
 
భార్య గర్భవతి అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టడంతో ఆమెకు గర్భస్రావం అయినట్లు తెలుస్తోంది. ఉద్యోగం పేరుతో భార్యను ఒంటరిగా వదిలి మరో మహిళతో విదేశాల్లో తిరిగిన విమాన టిక్కెట్లు, వాట్సాప్ చాటింగ్‌లను లావణ్య తన స్మార్ట్ ఫోన్ ఆధారాల కోసం భద్రంగా వుంచుకున్నట్లు సమాచారం. ఈ మనోవేదనతో భార్య ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్‌రావు, మరో మహిళ కాల్ డేటాపై ఆర్జీఐఏ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ కొత్త లక్షణాలు