Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

వెంటిలేటర్‌పై ఉన్న నేతలు కూడా మాట్లాడితే ఎలా? : మంత్రి శ్రీనివాస్ గౌడ్

Advertiesment
Srinivas Goud
, మంగళవారం, 2 జులై 2019 (17:52 IST)
కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తుంటే తెరాస ఎదుగుదలను ఓర్వలేనట్టుగా ఉందని తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ వెంటిలేటర్ మీద ఉంది. ప్రజలు ఛీ కొట్టినా కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదు. ప్రజల వెంట ఉండాలనే కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు కూడా తెరాసలోకి వచ్చారు. దాంతో ప్రతి పక్ష హోదా పోయింది. సచివాలయం ,అసెంబ్లీ నిర్మాణాలపై కాంగ్రెస్ నేతలది అనవసర రాద్ధాంతం. నిజాం అప్పట్లో అసెంబ్లీ కడితే ఇపుడు వాడుకుంటున్నాం. నిజాం తనకోసం కట్టుకున్నారా?
 
కెసిఆర్ కూడా తన కోసం సచివాలయం, అసెంబ్లీ కట్టుకోవడం లేదు. ముందు చూపుతోనే భవిష్యత్ తరాల కోసమే కొత్త నిర్మాణాలు. పాత భవనాలన్నీ హెరిటేజ్ భవనాలు కాదు. హెరిటేజ్ భవనం గుర్తింపు కోసం కొన్ని పద్దతులు ఉంటాయి. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్ళిన కాంగ్రెస్ నేతలు ఇపుడు సచివాలయం, అసెంబ్లీలపై అదే పంథా కొనసాగిస్తున్నారు. 
 
ప్రతిపక్ష హోదా పోయింది కాబట్టే కాంగ్రెస్ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. గతంలో విలువైన ప్రభుత్వ భూములు, కంపెనీలు అమ్ముకున్న కాంగ్రెస్ నేతలకు సచివాలయం, అసెంబ్లీలకు అద్భుత కట్టడాలు ఉండాలన్న ఆలోచన రాలేదు. వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్‌లాంటి అంతర్జాతీయ పత్రికలు కాళేశ్వరం కేసీఆర్ పాలనను పొగుడుతుంటే కాంగ్రెస్ నేతలు చవకబారుగా మాట్లాడుతున్నారు. కెసిఆర్‌ను విమర్శించే స్ధాయి కాంగ్రెస్ నేతలకు లేదు. రాదు కూడా. కేసీఆర్ ఎంత విమర్శిస్తే కాంగ్రెస్ ప్రజల్లో అంత చులకన అవుతోంది. కాంగ్రెస్ నేతలూ తలకింద, కాళ్ళు‌పైన పెట్టి తపస్సు చేసినా కెసిఆర్ సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు ఆపరు. కాంగ్రెస్ ధర్నాలకు బయపడి కేసీఆర్ ఒక్క ఇంచి కూడా వెనక్కి తగ్గరు. 
 
కాంగ్రెస్ నేతలు రైతు బంధు చెక్కులు తీసుకుంటారు, ప్రభుత్వ పథకాలు అనుభవిస్తుంటారు. అయినా కేసీఆర్‌పై కడుపు మంట ప్రదర్శిస్తుంటారు. కేసీఆర్‌పై అక్కసుతోనే ప్రతిదానిపై బురద చల్లే విధంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. చెట్ల కింద, గుడారాల కింద పాలన సాగాలన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉంది. కాంగ్రెస్ హాయంలో వేల కోట్ల భూములు ధారాదత్తం చేశార. ప్రజల కోసమే కొత్త సచివాలయం, అసెంబ్లీ. తెలంగాణ కు కొత్త సచివాలయం, అసెంబ్లీ కట్టడాలు చారిత్రాత్మకం కానున్నాయి. కాంగ్రెస్ నేతలు కూడా కొత్త భవనాలు కట్టాక కేసీఆర్‌ను పొగడక తప్పదు. 
 
ఇపుడు మాట్లాడినట్టే అసెంబ్లీ ఎన్నికల దాకా కాంగ్రెస్ నేతలు రకరకాల విమర్శలు చేశారు. ప్రజలు తెరాసకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయినా కాంగ్రెస్ తీరు మారడం లేదు. మా ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోంది. చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఎమ్మెల్యేకు సోదరుడు, జడ్పీ వైస్ చైర్మన్ అయినప్పటికీ కాగజ్ నగర్ ఘటన‌లో ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకుంది. తెరాస నేతలకు చెందిన ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నా ఫీజులు పెంచుకునేందుకు సీఎం కేసీఆర్ నిరాకరించారు. పేకాట క్లబ్బులు మూయించారని గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్ష్మీపార్వతి-పూనంలను వేధించిన కోటీ: అబ్బే... ఆ కోటి భాజపా సభ్యుడు కాదు...