హిజ్రాల గురించి నమ్మలేని నిజాలు...
రైల్వేస్టేషన్లలో లేదా బస్టాండ్లలో మనం వెయిట్ చేస్తుంటే భిక్షాటన చేసేవారు చాలా కామన్.. కానీ అలా భిక్షాటన చేసేవారిలో హిజ్రాలు కూడా ఉంటారు. హిజ్రాలు కాస్త విభిన్నంగా భిక్షాటన చేస్తుంటారు. డిమాండ్ చేసి మరీ అడుగుతుంటారు. కోరిన మొత్తం ఇవ్వకుంటే మగవారిని బా
రైల్వేస్టేషన్లలో లేదా బస్టాండ్లలో మనం వెయిట్ చేస్తుంటే భిక్షాటన చేసేవారు చాలా కామన్.. కానీ అలా భిక్షాటన చేసేవారిలో హిజ్రాలు కూడా ఉంటారు. హిజ్రాలు కాస్త విభిన్నంగా భిక్షాటన చేస్తుంటారు. డిమాండ్ చేసి మరీ అడుగుతుంటారు. కోరిన మొత్తం ఇవ్వకుంటే మగవారిని బావా అంటూ ఆడవారిని అక్కా అంటూ విసిగిస్తూ ఉంటారు. అంతేకాదు ఒక్కోసారి హిజ్రాలు దౌర్జన్యానికి దిగుతుంటారు. దాడులు చేసే వారిలో 10 శాతం మాత్రం హిజ్రాలు మాత్రమే ఉంటారు.
హిజ్రాలు మానవత్వం, ఆత్మాభిమానం కలిగి ఉంటారు. హిజ్రాలు ఇప్పటివారు కాదు. మహాభారతం, రామాయణ కాలంలో కూడా వీరున్నారు. హిందువుల్లో మాత్రమే హిజ్రాలు ఉన్నారని చాలామంది చెబుతుంటారు. కానీ ఇతర మతాల్లో కూడా హిజ్రాలు ఉన్నారని వారివారి మత గ్రంథాలు చెపుతున్నాయి. హిజ్రాలుగా మారడం చాలా అరుదుగా జరుగుతుంది. కొంతమంది పుట్టుకతోనే హిజ్రాగా పుడుతుంటారు. ఇండియాలో హిజ్రాను చాలా హీనంగా చూస్తుంటారు.
హిజ్రాకు అతీంద్రీయ శక్తులు ఉంటాయనే విశ్వాసం కూడా వుంది. ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరిగితే హిజ్రాలను పెద్దలు పిలుస్తుంటారు. వారు ఆశీర్వదిస్తే మంచిదట. అలాగే ఏ పని మొదలుపెట్టినా హిజ్రా ఆశీర్వదిస్తే మంచిది. ఎవరు ఎప్పుడు మరణిస్తారు అనేది హిజ్రాకు తెలుస్తుందట. కష్టపడి వ్యాపారాలు చేసే వారిలో హిజ్రాలు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హిజ్రాలకు రిజర్వేషన్లు వస్తున్నాయి.