Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇసుక సరఫరాకు పటిష్టమైన చర్యలు: జాయింట్ కలెక్టర్

Advertiesment
ఇసుక సరఫరాకు పటిష్టమైన చర్యలు: జాయింట్ కలెక్టర్
, మంగళవారం, 9 జూన్ 2020 (22:03 IST)
విజయవాడలో వివిధ నిర్మాణలకు అవసరమైన ఇసుకను పారదర్శకంగా సరఫరా చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. కె.మాధవిలత చెప్పారు.

స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి పలువురు బిల్డర్ట్లు, వివిధ నిర్మాణ కాంట్రాక్టర్లు,ట్రాన్స్ పోర్ట్ దారులు, మైనింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఇసుక సరఫరా పై ప్రభుత్వ మార్గదర్శకలపై సమీక్షించారు.

రెండు రోజుల్లో సంబంధిత వెబ్ సైట్ అందుబాటులో కి రానున్నదని చెప్పారు.బల్క్ ఆర్డర్లు కు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.

ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఇసుక సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.వర్ష కాలంలోఇసుక సరఫరాలో  ఎటువంటి సమస్యలు తలెత్తకుండా 20 లక్షల టన్నుల ఇసుక రిజర్వ్ స్టాక్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.

ఇసుక రవాణా కు సంబంధించి వాహనాలకు ఒకరోజు దగ్గర ప్రాంతానికి,మరోరోజు దూరప్రాంతనికి కేటాయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ నిర్మాణ ఏజన్సీ లకు,ప్రైవేట్ బిల్డర్ట్లు లకు ఎదో ఒక రీచ్,పట్టాలాండ్ ను కేటాయింపు చేసేందుకు నిర్ణయించారు. ఈ సమావేశంలో మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస కుమార్,జిల్లా సాండ్ అధికారి నాగయ్య,మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగిని తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా వెనక్కి తగ్గింది, భారత్ కమాండర్లతో చర్చలు సఫలం