Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దొంగ‌ను ప‌ట్టేసిన ...లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం!

దొంగ‌ను ప‌ట్టేసిన ...లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం!
విజ‌య‌వాడ‌ , బుధవారం, 8 డిశెంబరు 2021 (10:58 IST)
పోలీసులు అవకాశం కోసం ఎదురు చూశారు... ఇళ్ళ‌లో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డే హౌస్ బ్రేకర్ ని వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. తిరుప‌తి అర్బ‌న్ జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు ఈ పోలీస్ ఆప‌రేష‌న్ చేశారు.
 
 
తిరుప‌తి నగరంలో తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతున్ననేపథ్యంలో, జిల్లా యస్.పి అర్బన్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల సిబ్బందితో సమీక్ష నిర్వహించి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్.హెచ్.ఎం.ఎస్) విధానంపై ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించారు.


ఈ కార్యక్రమం ద్వారా తిరుపతిలోని ప్రజలు ఎల్.హెచ్.ఎం.ఎస్ అంటే ఏమిటో అవగాహనను పెంచుకున్నారు, తమ ఇంటికి తాళం వేసి బయట ఊర్లకు వెళ్లేటప్పుడు పోలీసులకు గోప్యంగా సమాచారం ఇవ్వడం నేర్చుకున్నారు. ఇదేమీ తెలియని ఇంటి దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు తమని ఎవరు పట్టుకుంటారులే అని ధీమాతో వరుస దొంగతనాలతో ముందుకెళ్లారు. కానీ ఇంటి లోపల ఎల్.హెచ్.ఎం.ఎస్ విధానం ద్వారా అమర్చిన మూడవ కన్ను నుంచి తప్పించుకోలేకపోయారు. 

 
ఈ సంఘటన పోలీసు విభాగానికి టెక్నాలజీని ఉపయోగించి దొంగలను పట్టుకోవడంలో విజయంగా చెప్పవచ్చు. ప్రజలు కష్టపడి సంపాధించి కూడబెట్టుకున్నఆస్తి, నగదు రక్షణకు అర్బన్ పోలీసులు అందిస్తున్న ఎల్.హెచ్.యం.యస్ ఎంతో ఉపయోగకరమైందని మరోసారి రుజువైంది. 
 
 
యం.ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకుంఠపురంలో గల నాలుగవ లైనులో చంద్రశేఖర్ అనే వ్యక్తికి చెందిన ఇంటిలో 29 నవంబర్ 2021 నాడు వారి వినతి మేరకు పోలీస్ కంట్రోల్ రూమ్ వారు ఎల్.హెచ్.ఎం.ఎస్ కెమెరా పోలీసులు అమర్చారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు డిసెంబర్ 15 వ తేదీ తిరిగి రానుండడంతో అప్పటి వరకు ఈ ఇంటిలో అమర్చిన కెమెరా పంపే సమాచారంపై రౌండ్ ది క్లాక్ కమాండ్ కంట్రోల్ వారు నిఘా ఉంచారు.

 
ఆరో తేదీ రాత్రి 12:13 గంటలకు తాళాలు పగలగొట్టి ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. దొంగ ఇంట్లోకి అడుగు పెట్టగానే యల్.హెచ్.యం.యస్ సిస్టం అలెర్ట్ అయ్యింది. దొంగ కదలికలను మోషన్ డిటెక్టవ్ సిస్టం ద్వారా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చంద్రశేఖర్ ఇంటి నుండి సమాచారం పంపింది. కెమెరా నుంచి బీప్ సౌండ్ సిగ్నల్స్ రావడంతో కమాండ్ కంట్రోల్ వారు అలెర్ట్ అయ్యి వెంటనే స్పైడర్ బ్లూకోల్ట్స్, రక్షక్ సిబ్బందిని సమాచారం చేరవేసి అప్రమత్తం చేసింది.
 
తక్షణమే స్పందించి ఆ ఇంటి దగ్గరగా చుట్టు ప్రక్కల గస్తీ విధుల్లో ఉన్న స్పైడర్ బ్లూకోల్ట్స్, సంబందిత పోలీస్ స్టేషన్ వారు దీంతో దొంగ చోరీకి యత్నించిన ఇంటికి చుట్టుప‌క్క‌ల ఉన్న గస్తీ పోలీస్ బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ ఇంటిని చుట్టూ ముట్టి దొంగను చాకచాక్యంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దొంగ‌ బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. 
 
 
ఎవరైనా తమ ఇంటికి తాళం వేసి బయట ఊరు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి వారి ఇంటిలో ఎల్.హెచ్.ఎం.ఎస్ సిస్టం అనుసంధానమైన కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా ఇంటి లోని వ్యక్తులు ఎక్కువ కాలం బయట ఉండి, ఇంటికి తాళం వేసినప్పటికీ వారి ఇంటికి పూర్తి స్థాయిలో భద్రత చేకూరుతుందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటీఎస్‌పై అవంతి శ్రీనివాస్ క్లారిటీ: బాబు మోసపూరిత ప్రకటనల్ని నమ్మొద్దు