Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిడుగు ప‌డుతుంద‌ట‌... త‌స్మాత్ జాగ్ర‌త్త‌! ఎక్క‌డ‌?

పిడుగు ప‌డుతుంద‌ట‌... త‌స్మాత్ జాగ్ర‌త్త‌! ఎక్క‌డ‌?
vijayawada , మంగళవారం, 10 ఆగస్టు 2021 (11:19 IST)
అస‌లే ఈ మ‌ధ్య వాతావ‌ర‌ణం బాగోలేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉద‌యం మండుటెండ‌... భ‌రించ‌లేని ఉక్క‌పోత‌... సాయంత్రం ఉరుములు మెరుపుల‌తో వ‌ర్షం. అంతా తేడాగా ఉంద‌ని అంద‌రూ భావిస్తున్న వేళ‌... విపత్తులశాఖ కమిషనర్ కె.కన్నబాబు ఓ పిడుగు లాంటి వార్త చెప్పారు.

తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక ఉంద‌ని... అక్క‌డి ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని ముంద‌స్తుగా స‌మ‌చారం అందించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్, కడియం, కొత్తపేట, ఆత్రేయపురం ,రావులపాలెం, ఆలమూరు, మండపేట, కపీలేశ్వరపురం, కాజులూరు, తాళ్లచెరువు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అయినవల్లి, పామర్రు, రామచంద్రాపురం ప్రాంతాల్లో పిడుగులు ప‌డే అవ‌కాశం ఉంది.

అలాగే, పశ్చిమ గోదావరి జిల్లా న‌ల్లజేర్ల, తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం, దేవరపల్లి, చాగల్లు, నిడదవోలు, పెంటపాడు, తణుకు, ఉండ్రాజవరం,పేరవల్లి, ఇరగవరం, అత్తిలి, పెనుమంట్ర, ఉంగుటారు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువ‌గా ఉంది.

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విపత్తులశాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చ‌రించారు. ఎవ‌రూ చెట్ల కింద‌, బహిరంగ ప్రదేశాల్లో ఉండవ‌ద్ద‌ని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాల‌ని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమె అజ్మీర్ జిల్లా కలెక్టర్‌, ఎత్తు 3 అడుగుల 2 అంగుళాలు