టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని కేసులు వదలడం లేదు. కడప జైలు నుంచి విడుదలైన ఆయనపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. కడప జైలు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి.. అక్కడ నుంచి భారీ కారు ర్యాలీతో బయలుదేరారు.
అయితే ఈ ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఆఫీసర్ తాడిపత్రి సీఐ దేవేందర్ పట్ల జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా వ్యవహరించారు.
ఈ ర్యాలీ హెవీ వాహానాలకు మాత్రమే అనుమతి ఉన్న లైన్‌లో ప్రవేశించడానికి ప్రయత్నించడంతో అక్కడే ఉన్న సీఐ దేవేందర్ ఆ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు.
దీంతో కాన్వాయ్ దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. సీఐ దేవేందర్‌తో దురుసగా వ్యవహరించారు. నా కారును ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు.
ఈ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు సైతం కొద్దిసేపు హంగామా సృష్టించారు. ఈ సంఘటనపై విచారణ చేసిన తరువాత అనంతపురం పోలీసులు జేసీపై మూడు సెక్షన్ల కితం కేసులు నమోదు చేశారు.
ఐపీసీ 353 తోపాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసీటి కేసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిపై నమోదు చేశారు పోలీసులు. జైలు నుంచి విడుదలైన 24 గంటలు తిరగక ముందే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో మూడు కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి 54 రోజుల పాటు జైలు జీవితం గడిపారు.