Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

మితిమీరిన వేగం.. ముద్దలా మారిపోయిన కారు... వైద్య విద్యార్థులు మృతి

Advertiesment
road accident
, ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (09:51 IST)
చిత్తూరు జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరి వేగంతో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి కారు ముద్దలా మారిపోయింది. దీంతో అందులోని ఇద్దరు వైద్య విద్యార్థులు, మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలో శెట్టిపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తన స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా పార్టీ చేసుకుని తిరిగి కారులో ఇంటికి బయలుదేరారు. అయితే, మద్యం మత్తులో అమిత వేగంతో కారును నడుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న లారీని ఢీకొన్నారు. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న మరో లారీకి కార్డు అడ్డంగా పడటంతో షిప్టు కారు ముద్దలా మారిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
 
మృతులు కుప్పంలోని ఈపీఎస్ వైద్య కాలేజీలో ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం చదుపుతున్నారు. మృతులను వికాస్, కళ్యాణ్‌, ప్రవీణ్‌గా గుర్తించారు. వీరిలో వికాస్, కళ్యాణ్‌లో ఫైనల్ ఇయిర్ ఎంబీబీఎస్ విద్యార్థులు. మరో మృతుడు కళ్యాణ్ సోదరుడు ప్రవీణ్. ఈ ప్రమాదానికి అమిత వేగమే కారణంగా తెలుస్తోంది. 
 
ఈ కారు పీఈఎస్ నుంచి కారులో కుప్పం వైపు వెళుతుండగా, జరిగింది. వీరంతా కడప, నెల్లూరు జిల్లాలకు చెదినవారిగా గుర్తించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్న జీయర్ స్వామీజీ చేతుల మీదుగా ఆలయ్ రోలింగ్ మెడోస్ ప్రారంభం