Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెదిరించి, వ్యభిచార వృత్తిలోకి దించి..!

బెదిరించి, వ్యభిచార వృత్తిలోకి దించి..!
, మంగళవారం, 8 జూన్ 2021 (13:05 IST)
కంటికి రెప్పలా కాచి కాపాడాల్సిన తండ్రి లాంటి వ్యక్తే.. ఆమె జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. ఆదరిస్తాడనుకున్న వ్యక్తే మురికికూపం లాంటి వ్యభిచారరొంపిలో దించేశాడు. చివరికి, ఒళ్లు అమ్మి సంపాదించిన డబ్బును కూడా ఆ నీచుడు చెరబట్టాడు.గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఒళ్లుగగుడ్పొడిచే సంఘటన చోటుచేసుకుంది.
 
తనతో పాటు తన కుమార్తెను చంపుతామని బెదిరించి తనతో ముంబైలో వ్యభిచారం చేయించి ఆ డబ్బు తీసుకొని ఇద్దరు వ్యక్తులు మోసం చేశారంటూ ఓ మహిళ వాపోయింది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వివాహిత నరసరావుపేట వన్‌ టౌన్‌ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.

సీఐ ఎం.ప్రభాకరరావు తెలిపిన వివరాల మేరకు.. 22 ఏళ్ల వయసులోనే యువతి.. భర్తతో విడిపోయింది. ఏ దిక్కూ లేక 2017వ సంవత్సరంలో పెద్ద కుమార్తెతో కలిసి నరసరావుపేటలోని ప్రకాష్‌ నగర్‌లో నివాసం ఉంటున్న తల్లి వద్దకు చేరుకుంది.
 
అయితే, అప్పటికే ఆమె తల్లి.. వినుకొండకు చెందిన దూదేకుల మీరావలితో అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కొన్నాళ్లు బాగానే ఉన్న మీరావలి.. తర్వాత, తన నీచబుద్ధి బయటపెట్టాడు. తాను చెప్పిన వ్యక్తులతో వ్యభిచారం చేయకపోతే వివాహితను, ఆమె కుమార్తెను చంపేస్తానని మీరావలి భయపెట్టాడు.
 
అయితే మీరావలి చెప్పిన పని చేసేందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో దూదేకుల మీరావలి, తన స్నేహితుడైన చాగల్లు గ్రామానికి చెందిన సైదాతో కలిసి ఆ యువతిని కొట్టి బలవంతంగా ముంబై తరలించి 9 నెలల పాటు వ్యభిచారం చేయించారు. వచ్చిన డబ్బును బాధిత యువతి కుమార్తె పేరుపై వేస్తామని నమ్మబలికారు. అయితే, మీరావలి, సైదా ఆ యువతి సంపాదించిన డబ్బును తమ అకౌంట్లకు జమ చేసుకున్నారు.

9 నెలల తర్వాత నరసరావుపేటకు వచ్చిన ఆమె తన డబ్బు గురించి మీరావలిని ప్రశ్నించగా.. తనను కొట్టి మళ్లీ బలవంతంగా 5 నెలల పాటు వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లి వ్యవభిచారం చేయించారని బాధిత యువతి పేర్కొంది. ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న ఆ యువతి.. కొంతకాలంగా మీరావలి చెప్పిన పని చేయకూడదని తాను నిర్ణయించుకుంది. అయితే, మళ్లీ వ్యభిచారం చేయకపోతే చంపుతామని మీరావలి, సైదా బెదిరిస్తున్నారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
తనతో బలవంతంగా వ్యభిచారం చేయించడమే కాకుండా.. తాను సంపాదించిన సుమారు రూ. 15 లక్షలు కాజేసిన మీరావలి, సైదాపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె వేడుకుంది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్ రావు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ క్యాబినెట్ మీటింగ్.. ఉద్యోగుల వేతన సవరణపై చర్చ