Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిరాయించినవారు ఇక మంత్రులు.. పార్టీనే నమ్ముకున్న వాళ్లు మాజీలు: టీడీపీకి జలక్‌లు తప్పవా?

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల ఆశ చూపడమే కాకుండా కోట్ల రూపాయలు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను మంత్రివర్గం లోకి తీసుకోవడంపై తర్జనభర్జన పడుతున్నారు.

Advertiesment
Cabinet Berth
హైదరాబాద్ , శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (04:04 IST)
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల ఆశ చూపడమే కాకుండా కోట్ల రూపాయలు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను మంత్రివర్గం లోకి తీసుకోవడంపై తర్జనభర్జన పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అమరనాథ్‌రెడ్డి, సుజయ రంగారావులకు కూడా మంత్రి పదవులు దక్కవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయా జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు ఇప్పటికే పార్టీ అధినేతకు అల్టిమేటమ్‌లు జారీ చేశారు.
 
కేబినెట్‌లో భారీగా మార్పులు, చేర్పులు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న వారిలో ఆరుగురు లేదా ఏడుగురికి ఉద్వాసన పలకనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న మృణాళినికి ఉద్వాసన పలకనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కళా వెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడు పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారని, ఆయనపై కూడా కత్తి వేలాడుతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని కూడా మంత్రివర్గం నుంచి తప్పించనున్నారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రావెల కిషోర్‌బాబు, గనులు శాఖ మంత్రి పీతల సుజాత, వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. కొత్తగా మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, గొల్లపల్లి సూర్యారావులు వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇటీవల కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన మహ్మద్‌ జానీకి మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి పదవి ఇస్తావా లేదా: బాబును నిలదీసిన లోకేష్- సరేనన్న తండ్రి