Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ 'నాగసొరకాయ' ఖరీదు కోటి?

ఈ 'నాగసొరకాయ' ఖరీదు కోటి?
, మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:44 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడకు వచ్చే భక్తుల నమ్మకాలను క్యాష్ చేసుకుని కేవలం రూ.10 కూడా పలకని సొరకాయలను ఏకంగా లక్షలు, కోట్ల రూపాయలకు అంటగట్టేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.

ఇలాంటి వారిలో 21 మందిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. సొరకాయలకు మహిమలు ఉన్నాయంటూ నమ్మించి భక్తులకు శఠగోపం పెడుతున్నారు. వారంతా ఓ ఆశ్రమంలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. మామూలుగా దొరికే సొరకాయలను తాము ఒక్కొక్కటి లక్షల రూపాయలకు అమ్మినట్టు నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించారు.

వీటిని నాగ సొరకాయలు అంటారు. ఇవి ఎక్కడపడితే అక్కడ పండేవి కావని, కేవలం శ్రీశైలం మల్లికార్జునుడు కొలువైన నల్లమల అడవుల్లో మాత్రమే లభిస్తాయంటూ వారు భక్తులను నమ్మిస్తారు. ఈ సొరకాయ ఇంట్లో ఉంటే ఎంతో మంచిది. అంటూ శ్రీశైలం వచ్చే భక్తులను నమ్మిస్తారు. మీకు కావాలంటే తక్కువకే అందిస్తామంటూ ఆఫర్లు ఇస్తారు.

ఏ సొరకాయలో ఏముందో అనుకునే భక్తులు కొందరు వీటిని కొనే అవకాశం కూడా ఉంది. భక్తుల ఆర్థిక స్థోమతను బట్టి ఏకంగా రూ.కోటి, రూ.2కోట్ల వరకు కూడా ఒక్కో సొరకాయను విక్రయిచినట్టు పోలీసులు తెలిపారు.  ‘నాగస్వరంలా ఉండే సొరకాయల మీద తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. చాలా మంది ఇవి కేవలం నల్లమలలోనే పెరుగుతాయని భావిస్తారు.
 
అలాంటి సొరకాయ ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. కానీ, అవేవీ నిజం కాదు.’ అని ఆత్మకూరు ఎస్ఐ నాగేంద్ర చెప్పారు. ఒక్కో సొరకాయను రూ.కోటి నుంచి రూ.2 కోట్లకు కూడా నిందితులు విక్రయించినట్టు ఆయన తెలిపారు.

ఈ నాగ సొరకాయ పేరుతో మోసం కేసులో మొత్తం 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు శ్రీశైలంలో ఆశ్రమం నిర్వహిస్తున్నారు. వారిలో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబర్ 23 నుంచి సూర్యలంకలో మిలటరీ శిక్షణ