Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసిపికి ఇదే చివరి ఛాన్స్: యనమల

Advertiesment
last chance
, శనివారం, 7 నవంబరు 2020 (07:59 IST)
రాష్ట్ర నూతన కమిటి సభ్యులను పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అభినందించారు. కొత్త కమిటిలో 61% పదవులు బిసి,ఎస్సీ,ఎస్టి ముస్లిం మైనారిటీలకే ఇవ్వడం ముదావహం అన్నారు.

బలహీనవర్గాల పార్టీ తెలుగుదేశం అనేది మరోసారి రుజువైంది. నూతన కమిటి టీమ్ స్పిరిట్ తో పని చేయాలని, అన్నివర్గాల ప్రజలకు అండగా ఉండాలని ఆకాంక్షించారు. 

‘‘టిడిపిపై తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో అపోహలు సృష్టించి వైసిపి అధికారంలోకి వచ్చింది. ఒక్కఛాన్స్ అని కాళ్లావేళ్లా పడి బతిమాలి, అధికారం పొందిన వైసిపి అనేక అరాచకాలకు పాల్పడి, అదే చివరి ఛాన్స్ చేసుకుంది.

బిసిలపై తప్పుడు కేసులు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులు-దౌర్జన్యాలతో అన్నివర్గాల ప్రజలకు దూరం అయ్యింది. పేదల సంక్షేమ పథకాల్లోనూ వేల కోట్ల అవినీతి కుంభకోణాలకు పాల్పడింది.

వాటాల కోసం బెదిరించి పారిశ్రామిక వేత్తలను తరిమేసింది, యువత ఉపాధి అవకాశాలకు గండికొట్టింది. వైసిపి బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలి. రైతులు, మహిళలు, యువత, చేతివృత్తుల వారు, కులవృత్తులవారు, పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని’’ యనమల రామకృష్ణుఢు ఆకాంక్షించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10వ తరగతి విద్యార్థులు 50 శాతం హాజరు: విద్యాశాఖ మంత్రి సురేష్