విజయవాడ ప్రకాశం బ్యారేజి సమీపంలోని సీతమ్మ వారి పాదాలు వద్ద ఈ అమ్మాయి అఘాయిత్యానికి పాల్పడింది. తన చేతిని బ్లేడుతో కోసుకుని ఈ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన పాదచారులు ప్రకాశం బ్యారేజీ పై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన ఆ యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇది ప్రేమ వ్యవహారమా? లేక కుటుంబంలో కలతలా అనేది తెలియాల్సి ఉంది. యువతి ఆత్మహత్య యత్నంపై దర్యాప్తు చేస్తున్నామని బెజవాడ పోలీసులు చెపుతున్నారు.