Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26న బీజేపీ మూడవ వర్చువల్ ర్యాలీ..విజయవాడ రానున్న నిర్మలా సీతారామన్

Advertiesment
26న బీజేపీ మూడవ వర్చువల్ ర్యాలీ..విజయవాడ రానున్న నిర్మలా సీతారామన్
, బుధవారం, 24 జూన్ 2020 (08:43 IST)
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న వర్చువల్ ర్యాలీలో భాగంగా ఈనెల 26 న మూడవ వర్చువల్ ర్యాలీ నిర్వహించబోతుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

నరేంద్రమోదీ రెండవసారి ప్రధానిగా ఎన్నికై ఒక సంవత్సరకాలం పూర్తి అయిన సందర్భముగా విజయోత్సవ కార్యక్రమాలు, ఉత్సవాలకు దూరంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా నిర్వహణ జరుగుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే నిర్వహించిన రెండు ర్యాలీ సభలు విజయవంతం అయ్యాయి.

అందులో మొదటిగా ఉత్తరాంధ్ర పార్లమెంట్ జిల్లాల సభకు అఖిల భారత భాజపా ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఈనెల 10న ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు.

ఈనెల 22న రాయలసీమ పార్లమెంట్ జిల్లాలకు రెండవ వర్చువల్ ర్యాలీ సభ నిర్వహించగా దీనికి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. ఇప్పటికే ఈ రెండు సభలు విజయవంతం అయ్యాయి.

ఇక చివరిగా నిర్వహించబోయే మూడవ వర్చువల్ ర్యాలీ ఈనెల 26 న కోస్తాంధ్ర పార్లమెంట్  జిల్లాల వారిగా నిర్వాహించటం జరుగుతుందని, ఈ సభకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ముఖ్య అతిధిగా విచేస్తారని కన్నా తెలిపారు.

బిజెపి రెండోసారి అధికారంలో మొదటి సంవత్సరం అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడానికి నిర్వహిస్తున్నామని కన్నా తెలిపారు. పార్టీ కార్యకర్తలు అందరూ అధిక సంఖ్యలో వీక్షించి ఈ ర్యాలీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్యాన్లతో చిన్నారులకు ముప్పే?