మాదిగలకు వర్గీకరణ ఫలాలు అందించింది టీడీపీ ప్రభుత్వమే..మాజీమంత్రి జవహర్

బుధవారం, 17 జులై 2019 (08:25 IST)
టీడీపీ ప్రభుత్వం హయాంలోనే మాదిగలకు ఎస్సి వర్గీకరణ చేసి వాటి ఫలాలను అందించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందనే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని మాజీమంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు.

ఎస్సి వర్గీకరణపై అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబును విమర్శించటంపై జవహర్ తప్పు పట్టారు.వర్గీకరణ అంశం కేంద్ర పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని మాదిగ, మాలలకు సామాజిక న్యాయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు. మాల, మాదిగల చిచ్చు పెట్టేందుకే రాజశేఖర్ రెడ్డి హయాంలో వర్గీకరణ చెల్లకుండా చేశారన్నారు.

వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం సముఖంగా ఉన్న నేపథ్యంలో ఎస్సి వర్గీకరణపై జగన్ దృష్టి పెట్టాలని సూచించారు. లేకపోతే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే మాదిగల ద్రోహిగా ఉంటారని జవహర్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాజమండ్రి యువతులను మింగేసిన చెన్నై రోడ్డు ప్రమాదం... 25 రోజులకే...