Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో భారీ వర్ష సూచన - కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Advertiesment
rain

ఠాగూర్

, ఆదివారం, 17 ఆగస్టు 2025 (11:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం మోస్తరు నుంచి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర స్థాయిలో ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశారు. 
 
రహదారుల్లో ఇబ్బందులు, ఇంజనీరింగ్ సమస్యలు తలెత్తితే ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా 040-35174352 అనే టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి సర్కిల్ స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్న కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. 
 
క్షేత్రస్థాయిలో అత్యవసర పరిస్థితులు తలెత్తితే స్థానిక అధికారులు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కూలినా, గుండ్లు పడినా వెంటనే సంబంధిత నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం - 11 మంది సజీవదహనం