Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు : అన్ని ప్రజల పురోగతికి కట్టుబడివున్నాం..

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు : అన్ని ప్రజల పురోగతికి కట్టుబడివున్నాం..
, సోమవారం, 15 మార్చి 2021 (12:15 IST)
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గత 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక పద్దును ఆమోదించేందుకు శాసనసభ, మండలి కొలువుదీరాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో గవర్నర్‌ తమిళిసై పాల్గొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి అసెంబ్లీ సమావేశ మందిరంలో ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ అన్ని వర్గాల ప్రజల పురోగతికి కట్టుబడివున్నట్టు తెలిపారు. 
 
గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
 
* అన్ని వర్గాల ప్రజల పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచాం. కేసీఆర్‌ సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపొందించాం.
 
* ఎన్నో ఇబ్బందుల నుంచి రాష్ట్రం నిలదొక్కుకుంది. ఆరున్నరేళ్ల మేధోమథనం ఫలితంగానే తెలంగాణ దూసుకెళ్తోంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై దృష్టి సారించాం. వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రం ముందుకెళ్తోంది.
 
* ఈ ఏడాది తలసరి ఆదాయం రూ.2 లక్షల 28 వేలకు పెరిగింది. ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తున్నాం. కొవిడ్‌ వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి. మేం వ్యూహాత్మకంగా అడుగులు వేశాం. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టాం. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది.
 
* విద్యుత్‌ రంగంలో రాష్ట్రం అద్వితీయ విజయాలు సాధించింది. 24 గంటలపాటు విద్యుత్‌ అందించే తొలి రాష్ట్రంగా రికార్డు సాధించాం. ఇళ్లు, దుకాణాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. జాతీయ సగటు కంటే రాష్ట్ర విద్యుత్‌ తలసరి వినియోగం ఎక్కువ. విద్యుత్‌ రంగ సంస్కరణలపై కేంద్రం రాష్ట్రాన్ని ప్రశంసించింది.
 
* మిషన్‌ భగీరథ పథకం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ పథకం ద్వారా మారుమూల తండాలకూ తాగునీరు ఇచ్చాం. తెలంగాణను ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం. మిషన్‌ కాకతీయ ద్వారా పురాతన చెరువులను పునరుద్ధరించాం. సుమారు 30 వేల చెరువులను బాగు చేశాం. మేం చేపట్టిన అనేక చర్యల వల్ల భూగర్భ జలాలు పెరిగాయి.
 
* సమైక్యాంధ్రలో రాష్ట్ర ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాం. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం. కరవు ప్రాంతాలకు సాగునీరు అందించాం.
 
* ఆస‌రా పెన్ష‌న్లు అందించి వృద్ధులు, వితంతువులు, విక‌లాంగుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌న్నారు. కుటుంబంలోని ప్ర‌తి స‌భ్యుడికి 6 కిలోల చొప్పున అందిస్తున్నామ‌ని తెలిపారు. ప‌ల్లె ప్ర‌గ‌తి ద్వారా గ్రామాల రూపురేఖ‌లు మారాయ‌న్నారు. 
 
* తెలంగాణ గ్రామాల‌ను దేశానికి ఆద‌ర్శంగా నిలిపే విధంగా ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంద‌న్నారు. తండాల‌ను, గూడెల‌ను కూడా గ్రామ‌పంచాయ‌తీల‌ను తీర్చిదిద్దిన ఘ‌న‌త మా ప్ర‌భుత్వానిది అని తెలిపారు. 
 
* క‌రోనా ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ, గ్రామాల అభివృద్ధికి నిధులు ఆప‌కుండా విడుద‌ల చేశామ‌న్నారు. ప్ర‌తి గ్రామంలో న‌ర్స‌రీ, డంప్‌యార్డు, రైతువేదిక‌, స్మ‌శాన‌వాటిక‌, హ‌రిత వ‌నాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. పట్ట‌ణ ప్ర‌గ‌తి ద్వారా మున్సిపాలిటీల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని గ‌వ‌ర్న‌ర్‌ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్: 'తెలంగాణ బీజేపీ నేతలకు మా పార్టీ అంటే గౌరవం లేదు, అందుకే వాణీదేవికి మద్దతిచ్చాం': ప్రెస్ రివ్యూ