Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీఆర్వో పరీక్షలకు పుస్తెల తాడు తీయాలా.. గవర్నర్ ఫైర్...

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన వీఆర్వో పరీక్షకు హాజరైన మహిళల మెడలోని పుస్తెల తాడు తీయడంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మండిపడ్డారు.

Advertiesment
వీఆర్వో పరీక్షలకు పుస్తెల తాడు తీయాలా.. గవర్నర్ ఫైర్...
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (09:03 IST)
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన వీఆర్వో పరీక్షకు హాజరైన మహిళల మెడలోని పుస్తెల తాడు తీయడంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మండిపడ్డారు. ముఖ్యంగా, పుస్తెల తాడు తీసేస్తేగానీ మహిళా అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఈ ఘటనకు బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తూనే వివరణ ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఆదేశించినట్టు సమాచారం. దీంతో టీఎస్పీఎస్సీ ఒక నివేదికను రాజభవన్‌కు పంపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు అయా పరీక్షా కేంద్రాల నిర్వాహకులే బాధ్యులవుతారని నివేదికలో పేర్కొనట్టు తెలిసింది. 
 
ఈ వివాదంపై టీఎస్పీఎస్సీ సెక్రటరీ ఎ.వాణీప్రసాద్‌ వివరణ ఇచ్చారు. మహిళా అభ్యర్థులు మంగళసూత్రాలు తీసి రావాలనే నిబంధనను తాము విధించలేదని తెలిపారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో మంగళసూత్రాలు తీసి రావాలని సిబ్బంది ఆదేశించినట్లు వార్తలు రాగానే స్పందించామని చెప్పారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమె కల్లుగీత కార్మికుని కూతురు... పవర్ లిప్టింగ్‌లో పతకం... రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు