Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిర్చి రసం తాగించి అత్యాచారం చేసేవాడు.. ఆపై మెడిసన్స్ ఇచ్చేవాడు: బాలికలు

షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు చేపట్టిన విచారణలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. నయీమ్ కేసులో కీలక నేతలున్నట్లు ఇప్పటికే సిట్ అధికారులు చేపట్టిన విచారణలో వెల

Advertiesment
Telangana government impartial in SIT probe against gangster Nayeem: Narasimha Reddy
, బుధవారం, 7 సెప్టెంబరు 2016 (19:13 IST)
షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు చేపట్టిన విచారణలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. నయీమ్ కేసులో కీలక నేతలున్నట్లు ఇప్పటికే సిట్ అధికారులు చేపట్టిన విచారణలో వెల్లడైన నేపథ్యంలో నయీమ్ బాలికలపై విచక్షణారహితంగా లైంగిక దాడులకు పాల్పడినట్లు బాధితులే స్వయంగా చెప్పడం అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. 
 
నయీమ్ గ్యాంగ్‌లో సుల్తానా, ఫయీం, తాహీరా, హసీనాబేగం, సలీమా బేగం తానియా తీవ్రంగా హింసించేవారని బాధిత బాలికలు చెప్తున్నారు. రెండ్రోజులకోసారి నయీం గదిలోకి వెళ్లాలని వేధించేవారని.. వెళ్ళకపోతే.. నయీమ్ మిర్చి రసం తాగించి, అత్యాచారం చేసి కొట్టేవాడని బాధిత బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ  మేరకు నయీమ్ ఇంట్లోని బాలికలను సాక్షులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
పోలీసుల విచారణలో ఆ బాలికలు అకృత్యాలను బయటపెట్టారు. త‌న‌కు పెళ్లి చేస్తాన‌ని చెప్పి న‌యీమ్ అత్త సుల్తానా త‌న‌ను ఆరేళ్ల క్రితం న‌యీమ్ వ‌ద్ద‌కు తీసుకొచ్చిన‌ట్లు ఓ బాలిక తెలిపింది. లైంగికంగా వేధించడమే కాకుండా.. ఆపై మెడిసిన్స్ కూడా ఇచ్చేవాడని బాలికలు విలపించారు. ఎదురు చెప్తే తీవ్రంగా హింసించడంతో పాటు, హత్యలు చేసేవాడని బాధిత బాలికలు వాంగ్మూలంలో చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షూటింగ్ లేని సమయాల్లో పవన్‌కు ప్రత్యేక హోదా గుర్తుకొస్తుందా? పబ్లిసిటీ కోసం పోరాటమా?