వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యా : ప్రదీప్‌చంద్ర
దురదృష్టవశాత్తు తాను రనౌట్ అయ్యానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్నారు. ఆయన పదవీవిరమణ చేశారు. ఈసంర్భంగా సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పల
దురదృష్టవశాత్తు తాను రనౌట్ అయ్యానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్నారు. ఆయన పదవీవిరమణ చేశారు. ఈసంర్భంగా సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్ తదితరులు హాజరై ప్రదీప్‌చంద్రను అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రదీప్‌చంద్ర సేవలను సీఎం ఉపయోగించుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రదీప్‌చంద్ర రూపొందించిన టీఎస్‌ఐపాస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలను తగిన విధంగా ఉపయోగించుకుంటుందన్నారు.
అనంతరం ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ.. '34 ఏళ్ల సర్వీసులో ఎవరికీ తలవంచలేదు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యా. ఇందులో నా తప్పేమీ లేదు. రాష్ట్రంతో పాటు అమెరికా నుంచి పలువురు తమ అభిప్రాయాలు చెప్పారు' అని వెల్లడించారు.