అమరావతిలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలయ్యేందుకు ప్రధానకారకుడైన తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్షీరాభిషేకం చేశారు.

మంగళవారం, 9 జనవరి 2018 (14:28 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలయ్యేందుకు ప్రధానకారకుడైన తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్షీరాభిషేకం చేశారు.
 
యాదవ కులస్తులకు రాజ్యసభ సీటు అవకాశం ఇస్తానని ఇటీవల కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో యాదవ యువభేరి నాయకులు కేసీఆర్ చిత్రపటానికి విజయవాడలో క్షీరాభిషేకం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా యువభేరి నాయకులు మాట్లాడుతూ, రాజ్యసభ సీటుకు అభ్యర్థిని ప్రకటించేవరకు ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా క్షీరాభిషేకాలు నిర్వహిస్తామని, అభ్యర్థిని ప్రకటించాక అమరావతి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి కేసీఆర్‌కి కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదం అందిస్తామని ప్రకటించారు.
 
కాగా, గతంలో కూడా విజయవాడకు ఒక రోజు పర్యటన కోసం అమరావతికి వచ్చిన కేసీఆర్‌కు పలువురు సాదర స్వాగతం పలికిన విషయం తెల్సిందే. కేసీఆర్ పేరుతో భారీ కటౌట్లు, బ్యానెర్లను ఏర్పాటుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అనన్యను ఔటర్ రింగ్ రోడ్ మింగేసింది... మితిమీరిన వేగమేనా?