Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెక్కీని చితక్కొట్టారు... కారణం ఏంటంటే?

crime scene
, సోమవారం, 9 మే 2022 (14:14 IST)
బంధువుల కంటే ముందు పొరుగింటివారు సాయం చేయడంలో ముందుంటారు. ఇరుగుపొరుగు వారు ఐక్యతతో వున్న ఎన్నో కుటుంబాలు మన దేశంలో వున్నాయి. కానీ చిత్తూరులో జరిగిన ఈ సంఘటన అందరికీ షాకిచ్చేలా చేసింది. ఎదురింటితో ఏర్పడిన విబేధాలు ఓ టెక్కీ ప్రాణాల మీదకు తెచ్చింది. 
 
తమ ఇంట్లో అద్దెకు వుండే మహిళను పొరుగింటికి వెళ్లొద్దు అన్నందుకు సుత్తితో ఓ సాఫ్ట్ వేరు ఇంజనీర్ పై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన పలమనేరులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్ళితే.. చిత్తూరు జిల్లా, పలమనేరు పాతపేట పోలీసు లైన్ వీధిలో నిరంజన్ నివాసం ఉండేవాడు. బెంగుళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో నిరంజన్ సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేసేవాడు. కరోనా మొదలైనప్పటి నుండి ఇంటి దగ్గర ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఉద్యోగం చేస్తున్నాడు. 
 
కోవిడ్ సమయంలో ఇంటి ఎదురుగా ఉన్న ఓ ముస్లీం కుటుంబంతో నిరంజన్ కి విభేదాలు తలెత్తాయి. ఆపై సర్దుకుపోయాయి. అయితే రెండు రోజుల క్రితం నిరంజన్ ఇంటి వద్ద అద్దెకు ఉండే మహిళ, ముస్లిం కుటుంబంతో సన్నిహితంగా ఉండేది. దీనిని గమనించిన నిరంజన్ ఎదురుగా నివాసం ఉంటున్న ఆ ఇంటికి వెళ్ళవద్దని చెప్పాడు. 
 
ఇదే విషయాన్ని ఆ మహిళ ముస్లిం కుటుంబీకులకు చెప్పడంతో ఒక్కసారిగా వారు ఆవేశానికి గురయ్యారు. అంతేగాకుండా దాదాపు పది మంది మూకుమ్మడిగా నిరంజన్ పైకి దాడికి దిగారు. నిరంజన్ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి, తమతో పాటుగా తెచ్చుకున్న సుత్తితో నిరంజన్ శరీర భాగాలపై కొట్టారు.
 
అంతటితో ఆగకుండా పిడిగుద్దులతో కంటి నుండి రక్తం వచ్చే విధంగా కిరాతకంగా కొట్టారు. ఇకపై నిరంజన్ తన ఇంటి వద్ద నివాసం ఉండే చంపేస్తామని బెదిరించారు. స్థానికులతో చికిత్స పొందిన నిరంజన్ పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతులకు వ్యవసాయ క్రెడిట్ కార్డులు