Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూడ్ ఫోటోలు పంపాలంటూ విద్యార్థినులకు మెసేజ్ పెట్టిన టీచర్..

Advertiesment
Teacher
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం చందర్లపాడు మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న డి శ్రీనివాస్‌రావు విద్యార్థినుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ, వారిని అసభ్యంగా తాకుతూ, ఎక్కడెక్కడో చెయ్యి వేసేవాడు. అంతటితో ఆగకుండా బాలికల ఫోన్ నెంబర్లు తీసుకుని, వారికి అసభ్య మెసేజ్‌లు పంపడం మొదలెట్టాడు. 
 
అశ్లీల ఫోటోలు, వీడియోలను పంపుతూ, న్యూడ్ ఫోటోలను పంపాలంటూ మెసేజ్ చేసేవాడు. ఈ మూర్ఖుడి ప్రవర్తనకు విసిగిపోయిన విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. వారందరూ డీఈవోను కలిసి ఇంగ్లీష్ టీచర్‌పై ఫిర్యాదు చేసారు. శ్రీనివాస్ రావు ప్రవర్తనపై ఫిర్యాదు అందడంతో నివేదిక సమర్పించాలని డీఈవో అధికారులను ఆదేశించారు. 
 
దర్యాప్తు చేపట్టిన అధికారులు శ్రీనివాస్ రావు పదో తరగతి విద్యార్థినులకు అసభ్యంగా మెసేజ్‌లు పంపుతున్నట్లు, న్యూడ్ ఫోటోలను పంపాల్సిందిగా కోరుతున్నట్లు వెల్లడైంది. విద్యార్థినులతోనే కాకుండా తోటి ఉపాధ్యాయురాళ్లతో కూడా శ్రీనివాస్ రావు అసభ్యంగానే ప్రవర్తించేవాడంటూ విచారణలో తేలింది. ఆధారాలతో సహా అతడి బాగోతాన్ని అధికారులు బట్టబయలు చేసారు. 
 
వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. డీఈవో కేసును పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేయడంతో సదరు టీచర్‌ను చందర్లపాడు విడిచి వెళ్లకుండా వారు ఆదేశాలు జారీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు దూకుడు... లోక్‌సభ అభ్యర్థుల పేర్లు వెల్లడి...