Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ఖరారు

Advertiesment
tdp flag

ఠాగూర్

, ఆదివారం, 20 అక్టోబరు 2024 (16:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను అధికార టీడీపీ ప్రకటించింది. కృష్ణా - గుంటూరు, తూర్పు గోదావరి - పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవుల గడువు 2025 మార్చితో ముగియనున్నాయి. దీంతో ఈ రెండు స్థానాలకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. 
 
కృష్ణా - గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, తూర్పుగోదావరి - పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఏపీ టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం అధికారికంగా వెల్లడించారు. కాగా, వైకాపా కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కృష్ణా - గుంటూరు జిల్లా అభ్యర్థిగా పొన్నూరు గౌతమ్ రెడ్డి పేరును ఖరారు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుర్ల గ్రామంలో డయేరియా.. పర్యటించనున్న డిప్యూటీ సీఎం