Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు : పరిటాల శ్రీరామ్ దీక్ష

Advertiesment
ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు : పరిటాల శ్రీరామ్ దీక్ష
, సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (12:19 IST)
అనంతపురం జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ జిల్లాలోని ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాకు చెందిన టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ నిరాహారదీక్షకు దిగారు. ధర్మవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన దీక్షకు కూర్చొన్నారు. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు జరుగనుంది.
 
ఈ సందర్భంగా జిల్లాకు చెందిన వైకాపా నేతల తీరుపై ధ్వజమెత్తారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేస్తే వైకాపా నేతలు ఏం చేస్తున్నారని, గాడిదలు కాస్తున్నారా అని నిలదీశారు. ఈ డివిజన్ ఎన్నో ఏళ్లుగా ఉంటూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందని చెప్పారు. ధర్మవరం అభివృద్ధిని  వెనక్కి నెట్టేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో నాగార్జున కేసు పెడతానని బెదిరించారు.. సీపీఐ నారాయణ