Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మల్లెల పద్మనాభరావు కు చంద్రబాబు నివాళి

Advertiesment
Mallela Padmanabha Rao
, బుధవారం, 7 ఆగస్టు 2019 (12:26 IST)
ఇబ్రహీంపట్నం టిడిపి సీనియర్ నాయకులు ఇబ్రహీంపట్నం మాజీ సర్పంచ్ శ్రీ మల్లెల అనంత పద్మనాభరావు (91) ఆయన స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన భౌతిక కాయనికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూలమాల వేసి, తెలుగుదేశం కండువాకప్పి నివాళులర్పించారు. 
 
కాగా, మల్లెల పద్మనాభరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఆరుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. ఆయన 1928లో మల్లెల కొండయ్య మహా లక్ష్మి దంపతులకు. ఆయన బీఏ వరకు చదువుకున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డ్ డైరెక్టరుగా మూడు పర్యాయాలు పని చేశారు.
webdunia
 
1952 నుంచి 48 సంవత్సరాల పాటు ఇబ్రహీంపట్నం గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన హయాంలో డాక్టర్ జాకీర్ హుస్సేన్ కళాశాల స్థలం, పంచాయతీ కార్యాలం స్థలాన్ని ప్రాథమిక సహకార సంఘం స్థలం దానంగా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 76 ఎకరాలు అంటే సుమారుగా రూ.200 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేశారు. మల్లెల పద్మనాభ రావు నగర్‌గా నామకరణం చేసి 1500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరులో విజిలెన్స్ దాడులు.. భారీగా ఎరువుల నిల్వలు స్వాధీనం