Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌పై విపరీత విమర్శలొద్దు.. తప్పుగా అర్థం చేసుకోవద్దు: టీజీపై బోండా ఫైర్

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపింది. టీడీపీ నేతలు కొందరు పవన్‌కు మద్దతు పలికితే.. మరికొందరు పవన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ రాజ్యస

Advertiesment
పవన్‌పై విపరీత విమర్శలొద్దు.. తప్పుగా అర్థం చేసుకోవద్దు: టీజీపై బోండా ఫైర్
, మంగళవారం, 30 ఆగస్టు 2016 (11:51 IST)
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపింది. టీడీపీ నేతలు కొందరు పవన్‌కు మద్దతు పలికితే.. మరికొందరు పవన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ రాజ్యసభ స‌భ్యుడు టీజీ వెంకటేశ్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప‌వ‌న్ ఇప్ప‌టికైనా త‌న ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకోవాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కుంభకర్ణుడిలా నిద్రపోయార‌ని విమ‌ర్శించారు. ఇలాంటి వ్యాఖ్య‌లు త‌మిళ‌నాడులో చేస్తే ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత కాళ్లు, చేతులు విర‌గ్గొట్టించేవార‌ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత ఎమ్మెల్యే బోండా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేతలు విపరీత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ విమర్శలు చేయడాన్ని బోండా ఉమ తప్పు పట్టారు.

క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీలో ఉండి టీజీ వెంకటేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. పవన్ కల్యాణ్ తిరుపతిలో చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తప్పుగా అర్థం చేసుకోవద్దని.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని బోండా ఉమ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనియా మాట జగన్ వినివుంటే.. సీమాంధ్రులకు కష్టాలుండేవి కాదు : టీజీ వెంకటేష్