Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీసీలకు రిజర్వేషన్ల పై గవర్నర్​కు టీడీపీ ఫిర్యాదు

బీసీలకు రిజర్వేషన్ల పై గవర్నర్​కు టీడీపీ ఫిర్యాదు
, గురువారం, 5 మార్చి 2020 (08:02 IST)
బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పరంగా అన్యాయం జరుగుతోందని గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. 94 నుంచి 2013 వరకు బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు.

ప్రస్తుతం ఆ శాతం తగ్గటానికి కారణాలపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బీసీలకు న్యాయం చేసే విషయంలో అన్నిపార్టీలను కలుపుకొని పోతామని అచ్చెన్నాయుడు చెప్పారు.
 
జగన్‌కు చంద్రబాబు బహిరంగ లేఖ
సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. బీసీలకు అమలవుతున్న 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించాలని కోరారు. సుప్రీంకోర్టులో వెంటనే స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ తాజా చర్య వల్ల బీసీలకు రిజర్వేషన్‌ ఫలాలు దూరమవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు అమలవుతున్న 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించాలని కోరారు. సుప్రీంకోర్టులో వెంటనే స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయాలని విజ్ఞప్తి చేశారు.

బీసీలకు 24 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలనుకోవడం గర్హనీయమన్న చంద్రబాబు.. ఇంత తీవ్రమైన సమస్యపై అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.

బీసీ సంఘాలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం సరికాదని హితవు పలికారు. బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రగతికి టీడీపీ కృషి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ వైరస్‌తో బాధ: రాజధాని రైతులు.. 79వ రోజుకు ఆందోళన