Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

Advertiesment
chandrababu
, శుక్రవారం, 5 ఆగస్టు 2022 (13:10 IST)
వైకాపా ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం ట్వీట్లు చేశారు. వైసిపి ప్రభుత్వ పాలనపై గడపగడపలో  ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేత వ్యక్తం అవుతుంది. కాలర్ ఎగరేసుకుని ఎమ్మెల్యేలు తిరగడం కాదు... జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. సంక్షేమంలో కోతలు, అభివృద్ది పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతుంది. 
 
అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ వస్త్రపరిశ్రమలో ఇదే ఏడాది జూన్‌ 3న విషవాయువులు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాటి ప్రమాదంపై  ప్రభుత్వం విచారణ కమిటీని నియమించినా ఇప్పటివరకు ప్రమాదానికి కారణాలేంటో కమిటీ చెప్పలేకపోయింది. 
 
పాలనను ప్రశ్నించిన ప్రతి వారిపై కేసు పెట్టాలి అని ఈ ప్రభుత్వం భావిస్తే... రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిపైనా జగన్ కేసులు పెట్టాల్సి ఉంటుంది. 
 
వేపనపల్లి గ్రామంలో ఘటనకు వైసిపి క్షమాపణ చెప్పి విద్యార్థిపై,అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు,టిడిపి నేతలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలి. వెంటనే అందరినీ విడుదల చెయ్యాలి. స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డిజిపి చర్యలు తీసుకోవాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశఆరు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసిపి ఎంపీ Gorantla Madhav న్యూడ్ కాలింగ్ చూసే గతి పట్టింది: సోమిరెడ్డి ఆగ్రహం