అక్కడ ఘనవిజయం.. ఇక్కడ సీన్ రివర్స్.. టీడీపీకి షాక్ తెప్పిస్తున్న పట్టభద్ర ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచిన అధికార టీడీపీకి.. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతోంది. అనంతపురం, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వెనుకంజలో ఉంది. ఈ రెండు చోట్లా వైఎస్ఆర్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచిన అధికార టీడీపీకి.. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతోంది. అనంతపురం, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వెనుకంజలో ఉంది. ఈ రెండు చోట్లా వైఎస్ఆర్ సీపీ బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక అనంతపురం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలోనూ టీడీపీ వెనుకంజలో ఉంది.
అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ.. అనంతపురం, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తుది ఫలితాలు వెల్లడి కావాల్సివుంది. వైఎస్‌ఆర్, కర్నూలు, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే ఆ మూడు సీట్లు వైఎస్ఆర్ సీపీనే సునాయాసంగా గెలుస్తుంది. కానీ టీడీపీకి బలం లేకున్నా.. వైఎస్ఆర్ సీపీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రలోభాలు పెట్టి, దారికి రాకుంటే బెదిరించి మరీ ఓట్లు వేయించుకుంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి షాక్ తగులుతోంది.
టీడీపీ స్థితి ఇలాగే మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు భవిష్యత్‌లో టీడీపీ స్థితికి అద్దం పడతాయని వైఎస్ఆర్ సీపీ నేత ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. ప్రలోభపెట్టడానికి అవకాశం లేని ఎన్నికల్లో స్వేచ్ఛగా పౌరులు పాల్గొంటే టీడీపీ ఎదుర్కోలేదని స్పష్టమైందని చెప్పారు.