Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నికల ప్రచారంలో వున్న టీడీపీ అభ్యర్థి.. తల్లీబిడ్డలను కాపాడారు.. ఎలా?

Advertiesment
Tdp alliance candidate peforms emergency surgery saves mother and infant

సెల్వి

, శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (08:15 IST)
ఎన్నికల ప్రచారంలో వున్నప్పటికీ ఆ మహిళ తన వైద్య వృత్తిని గుర్తు చేసుకుని తల్లీబిడ్డలను కాపాడారు. అత్యవసర పరిస్థితిలో తల్లీబిడ్డలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. దర్శి టీడీపీ కూటమి అభ్యర్థి డా.లక్ష్మి గైనకాలజిస్ట్. 
 
దర్శి మండలం అబ్బాయిపాలేనికి చెందిన వెంకట రమణ గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను దర్శిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కానీ శస్త్రచికిత్స అవసరమని వైద్య సిబ్బంది భావించారు. 
 
కానీ అప్పటికి ఆసుపత్రి వైద్యురాలు చాలా దూరంలో ఉన్నారు. మరోవైపు ఆసుపత్రికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోనే దర్శి టీడీపీ కూటమి అభ్యర్థి డా.గొట్టిపాటి లక్ష్మి ప్రచారం నిర్వహిస్తున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఆమె ఆస్పత్రికి చేరుకుని గర్భిణికి శస్త్రచికిత్స చేసి తల్లీబిడ్డలను కాపాడారు. దీంతో, మహిళ బంధువులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో తొలిరోజు 42 నామినేషన్లు దాఖలు.. ఏప్రిల్ 29 చివరి తేదీ