Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బూతు పురాణం వినిపించిన సినీ నటుడు బాలకృష్ణ పీఏ హౌస్ అరెస్టు

అనంతపురం జిల్లా హిందూపుర్‌ అసెంబ్లీ నియోజగవర్గానికి చెందిన అధికార టీడీపీ నేతలకు బూతు పురాణం వినిపించిన సిట్టింగ్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్‌ను గృహనిర్బంధం చేసినట్టు

Advertiesment
Hindupur MLA Balakrishna
, ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (14:17 IST)
అనంతపురం జిల్లా హిందూపుర్‌ అసెంబ్లీ నియోజగవర్గానికి చెందిన అధికార టీడీపీ నేతలకు బూతు పురాణం వినిపించిన సిట్టింగ్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్‌ను గృహనిర్బంధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పీఏ శేఖర్‌పై నియోజకవర్గ ప్రజలతో పాటు ఆ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 
 
ఈనేపథ్యంలో హిందూపురంలోని బాలకృష్ణ నివాసంలో పీఏ శేఖర్‌ను హౌస్ అరెస్టు చేశారు. హిందూపురంలో 144 సెక్షన్ విధించినట్లు తెలుస్తోంది. కాగా, బాలకృష్ణ పీఏ వ్యవహారం కేవలం హిందూపురం నియోజకవర్గానికే కాకుండా ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రభావం బాలకృష్ణ ఇమేజ్‌పై పడకుండా ఉండాలనే ఉద్దేశంతో శేఖర్‌ను దూరంగా పెట్టనున్నట్టు తెలుస్తోంది. పీఏ శేఖర్ తీరుపై హిందూపురం టీడీపీ ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్న విషయం తెల్సిందే. 
 
కొన్ని గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు ఏకంగా రహస్య సమావేశాలు నిర్వహించారు. ఇవి స్థానికంగా టీడీపీ శ్రేణుల్లో కలకలం సృష్టించాయి. పైపెచ్చు.. పీఏ పదవి నుంచి శేఖర్ ను తప్పించకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని బాలకృష్ణ కు ఇప్పటికే వారు హెచ్చరించచేశారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేశాకే పీఏ శేఖర్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎంగా శశికళ ప్రమాణం చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు : సుబ్రమణ్య స్వామి