Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తనూజ కేసులో స్నేహితుడే కీలకం.. లైంగికంగా వేధించినట్టు అనుమానం?

తనూజ కేసులో స్నేహితుడే నిందితుడిగా కనిపిస్తున్నాడు. ఆ యువతిని లైంగికంగా వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. కృష్ణరాయపురానికి చెందిన కె.తనూజ (14) ఓ యువకుడితో స్నేహం చేయడం చూసిన తల్లిదండ్రులు

Advertiesment
Tanuja suspicious murder case
, బుధవారం, 27 జులై 2016 (13:28 IST)
తనూజ కేసులో స్నేహితుడే నిందితుడిగా కనిపిస్తున్నాడు. ఆ యువతిని లైంగికంగా వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. కృష్ణరాయపురానికి చెందిన కె.తనూజ (14) ఓ యువకుడితో స్నేహం చేయడం చూసిన తల్లిదండ్రులు గత శనివారం రాత్రి తీవ్రంగా మందలించారు. ఆ సమయంలో తనూజ ఇంటి నుంచి బయటకి వచ్చింది. ఆ తర్వాత శవమై తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ దర్యాప్తులో ఇంటి నుంచి బయటకు వచ్చిన తనూజ... స్నేహితుడిని కలిసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇద్దరూ కలిసి కృష్ణరాయపురంలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డుపక్కన ఉన్న అపార్ట్‌మెంటులోని ఒక ఫ్లాట్‌లోకి వెళ్లినట్టు వాచ్‌మెన్‌ పోలీసులకు వివరించాడు. అదేసమయంలో మరో ఫ్లాట్‌లో మద్యం సేవిస్తూ ఇద్దరు రౌడీ షీటర్లతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. 
 
ఆ సమయంలో బాలికతో వచ్చిన యువకుడు వారితో మాట్లాడాడు. అందరూ కలిసి బాలికను లైంగికంగా వేధించినట్లు పై వివరాల ఆధారంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనే పోలీసులు ఆ యువకుడితో పాటు రౌడీషీటరైన అతని మేనమామ, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వినికిడి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరయ్యారు.. పెళ్లికి నో.. నిద్రమాత్రలు మింగేసింది.. నెయిల్ పాలిష్ తాగేసింది...!