Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీ హయాంలో భారత్ రామరాజ్యంగా మారుతుంది : స్వరూపానందేంద్ర

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో భారత్ రామరాజ్యంగా మారుతుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భారతదేశ వ

Advertiesment
మోడీ హయాంలో భారత్ రామరాజ్యంగా మారుతుంది : స్వరూపానందేంద్ర
, గురువారం, 23 మార్చి 2017 (09:53 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో భారత్ రామరాజ్యంగా మారుతుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భారతదేశ వెలుగు కిరణం ప్రధాని మోడీ అన్నారు. 
 
దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ఒక పీఠాధిపతిని ముఖ్యమంత్రిని చేయడం అభినందనీయమన్నారు. అదేసమయంలో అయోధ్యలో రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని తెలిపారు. 
 
ఈ విషయంలో సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు ఇరు వర్గాలు కూర్చొని చర్చించి ఓ మంచి నిర్ణయానికి రావాలని ఆయన కోరారు. కాగా, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలితో సంబంధం పెట్టుకున్నాడనీ బర్రెల కొట్టం వద్దకు పిలిచి హత్య చేశాడు...