Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుంది: స్వామి పరిపూర్ణానంద

Advertiesment
రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుంది: స్వామి పరిపూర్ణానంద
, సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (14:36 IST)
పాము తన గుడ్డును తానే తినేసేలా ఏపీలో పరిస్థితులు ఉన్నాయంటూ స్వామి పరిపూర్ణానంద ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుందని చెప్పారు. రాష్ట్రాన్ని ఈ కాలసర్పం చేతిలో నుంచి బయటపడేయాలంటే ఇలాంటి సమాలోచన అనే వేదిక చాలా అవసరం అని ఉద్ఘాటించారు. 
 
ఏ ప్రభుత్వం కూడా మతమార్పిడిలను ఆపాలనే చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆశ్రమాలు, మఠాలు ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రంలో పరాధీనత పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ పరిస్థితిని సంస్కరించాలంటే మేధావులందరూ ఒక వేదికపైకి వచ్చి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పరాధీనత నుంచి రాష్ట్రాన్ని కాపాడి, ఆ తర్వాత స్వాధీనత నుంచి స్వతంత్రత అంశం ఆలోచించాలని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగరేణి ప్రైవేటుపరానికి కేంద్రం కుట్ర : మంత్రి కేటీఆర్