గ్యాంగ్‌స్టర్ నయీం హతం... మట్టుబెట్టిన గ్రేహౌండ్స్ దళాలు
తెలుగు రాష్ట్ర ప్రజలను వణికించిన అండర్ వరల్డ్ డాన్ నయీం ఎట్టకేలకు పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. నయీం స్వస్థలం నల్లొండ జిల్లా భువనగిరి. దాదాపు 100కు పైగా కేసులు, 20 హత్య కేసుల్లో నిందితుడైన ఈ క్రిమినల
తెలుగు రాష్ట్ర ప్రజలను వణికించిన అండర్ వరల్డ్ డాన్ నయీం ఎట్టకేలకు పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. నయీం స్వస్థలం నల్లొండ జిల్లా భువనగిరి. దాదాపు 100కు పైగా కేసులు, 20 హత్య కేసుల్లో నిందితుడైన ఈ క్రిమినల్ తన ఆగడాలకు గ్యాంగ్‌ను నియమించుకుని ప్రభుత్వానికే సవాల్ విసిరిన నయీం సోమవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నందిగామ (మహబూబ్ నగర్ జిల్లా) గ్రామంలోని మిలీనియం టౌన్ షిప్‌లోని ఓ వ్యక్తి ఇంట్లో తలదాచుకుంటూ స్థానిక భూదందాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా నయీమ్ తలదాచుకున్న భవనాన్ని గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారు. అయితే అప్పటికే పోలీసుల అలికిడి విన్న నయీమ్ అనుచరుడు పోలీసులపైకి కాల్పులకు దిగాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి అతడిని అతడి గ్యాంగ్‌ని మట్టుబెట్టారు. ఐపీఎస్ వ్యాస్, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, మాజీ మావోయిస్టు సాంబశివుడు, రాములు హత్యల కేసులో నయీం ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. దీంతో నయీంపై పోలీసులు చాలాకాలంగా నిఘాపెట్టారు. దాదాపు 20 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులకు ముచ్చెమటలు పట్టించిన నయిూం ఎట్టకేలకు గ్రౌహౌండ్స్ దళాల చేతిలో ఎన్‌కౌంటర్ అయ్యాడు.