Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుజనా ఫౌండేషన్ సీఈవోగా ఉన్న ఏ.కే.రావు అనుమానాస్పద మృతి

Advertiesment
సుజనా ఫౌండేషన్ సీఈవోగా ఉన్న ఏ.కే.రావు అనుమానాస్పద మృతి
విజ‌య‌వాడ‌ , గురువారం, 25 నవంబరు 2021 (13:00 IST)
ప్రముఖ సింగర్ హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్ సీఈవోగా ఉన్న ఏ.కే.రావు అనుమానాస్పద స్థితిలో బెంగళూరులో మరణించారు. ఆయన మృతదేహం బెంగళూరులోని ఓ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు. ఏకే రావు తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.  గత వారం రోజులుగా ఏకే రావు కుటుంబ సభ్యులతో సహా అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్లారో స్పష్టత లేదు. కానీ హఠాత్తుగా ఆయన మృతదేహం రైలు పట్టాలపై కనిపించింది. 
 
 
తన తండ్రికి ఖచ్చితంగా హత్యేనని సింగర్ హరిణి అనుమానిస్తున్నారు. దీనిపై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఆ రిపోర్టులు రావాల్సి ఉంది. ఏకే రావు మృతదేహం రైల్వే ట్రాక్‌పై దొరికిన తర్వాత అప్పటి వరకూ ఆచూకీ లేని కుటుంబసభ్యులు బెంగళూరులోని మార్చురీ వద్దకు వెళ్లారు. తమ ఫిర్యాదు కూడా పోలీసులకు ఇచ్చారు. 
 
 
ఏకే రావు కుటుంబసభ్యుల మధ్య మధ్య ఏమైనా కుటుంబ గొడవలు ఉన్నాయా అనే దిశగా బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏకే రావు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అన్నది పోస్ట్ మార్టంలో తేలే అవకాశం ఉంది. ఏకే రావు కుమార్తె సింగర్ హరిణి మాత్రం ఖచ్చితంగా హత్యేనని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
 
బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్‌కు ఏకే రావు చాలా కాలంగా సీఈవోగా పని చేస్తున్నారు. ఆ సంస్థకు చెందిన ఏదైనా వివాదాలు ఉన్నాయా అనే దిశగానూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక అవకతవకల విషయంలో ఇప్పటికే సుజనా చౌదరిపై సీబీఐ కేసులు కూడా ఉన్నాయి. చనిపోయిన ఏకే రావు ఎంపీ అయిన సుజనా చౌదరికి చెందిన సంస్థకు సీఈవోగా ఉండటం.. ఏకే రావు కుమార్తె ప్రముఖ సింగర్ కావడంతో ఈ వ్యవహారం సంచలనాత్మకం అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్