Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేక ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదాతోనే నష్టం : కేంద్రమంత్రి సుజనా చౌదరి

ప్రత్యేక ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదాతోనే అధిక నష్టం కలుగుతుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేటాయించకుండా, ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం కేటాయించిన విషయంతెల్సిందే. దీనిపై రాష

Advertiesment
sujana chowdhury
, సోమవారం, 12 సెప్టెంబరు 2016 (11:51 IST)
ప్రత్యేక ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదాతోనే అధిక నష్టం కలుగుతుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేటాయించకుండా, ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం కేటాయించిన విషయంతెల్సిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 
 
దీనిపై సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కొన్ని పార్టీలు, నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాకు, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధమే లేదని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా కంటే కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీయేమేలన్నారు. హోదా వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందన్నారు. 
 
'సరిహద్దు, కొండ ప్రాంత రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ప్రకటిస్తారు. ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే, జాతీయాభివృద్ధి మండలి(ఎనడీసీ)లోనే నిర్ణయించాలి. ఇప్పుడా సంస్థ లేదు. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ ఏర్పడింది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 42 శాతం వాటాను సిఫారసు చేసింది. ఈ మార్పుల కారణంగా ప్రత్యేక హోదా దక్కిన రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యాభర్తలను కొట్టి... మహిళ దుస్తులు చించేసి లైంగిక వేధింపులు.. టోల్‌గేట్ సిబ్బంది వేధింపులు