Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒంగోలుకు చేరిన‌ బ్లాక్ క్యాట్ కార్ ర్యాలీ

Advertiesment
sudarshan
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 19 అక్టోబరు 2021 (10:41 IST)
ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ లో భాగంగా బ్యాక్ క్యాట్ క‌మెండోలు నిర్వ‌హిస్తున్న కార్ ర్యాలీ  మంగళవారం ఒంగోలుకు చేరింది. కార్ ర్యాలీకి ఒంగోలులోని వరలక్ష్మి టాటా షోరూమ్ నిర్వాహకులు  ఘన స్వాగతం పలికారు. బ్లాక్ క్యాట్ కమెండోలపై పూలు జల్లుతూ సంప్రదాయబద్దంగా ఆహ్వానం పలికారు. ఒంగోలు పట్టణంలో ఎన్.ఎస్.జి. కార్ ర్యాలీని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.జి. కల్నల్ ఎ.ఎస్.రాథోడ్ మాట్లాడుతూ, నేటి యువత సోదరభావాన్ని, స్వాంతంత్ర్య స్పూర్తిని పెంపొందించుకోవాలన్నారు.

స్వాతంత్ర సర్ణోత్సవాల సందర్బంగా ఆక్టోబర్ 2వ తేదీన ఢిల్లీలో సుదర్శన్ భారత్ పరిక్రమ బ్లాక్ క్యాట్ కార్ ర్యాలీ ప్రారంబించామన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు వచ్చామన్నారు. దేశంలోని విభిన్న సంస్కృతులను చూస్తూ, స్వాతంత్రోద్యమంలో వివిధ ప్రాంతాల విశిష్టతను తెలుసుకుంటూ, సమానత్వాన్ని, సోదరభావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. నేటి యువత భారతదేశ ఔనత్యాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పాలన్నారు. ఘనమైన స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని పరిరక్షించాలని కల్నల్.ఓ.ఎస్.రాథోడ్ కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు హాల్ టిక్కెట్ల పంపిణీ